ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియాఫ్లిప్ కార్ట్ రానున్న పండుగ సీజన్ కు దూసుకుపోయే కొత్త ప్లాన్ తో రెడీగా ఉన్నాయి . వినియోగదారులను ఆకర్షించే ఫెస్టివల్ సేల్ నిర్వహించనున్నాయి. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ అందించే ఫెస్టివ్ సీజన్ అమ్మకాలను నిషేధించాలని లేదా జిఎస్‌టి, ఆదాయపు పన్ను ఎగవేసే అవకాశం ఉన్న నేపధ్యంలో అమ్మకాలను పర్యవేక్షించడానికి "స్పెషల్ టాస్క్ ఫోర్స్" ను నియమించాలని కోరుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ఒక లేఖ రాసింది.

ఈ కామర్స్ సంస్థల ఫెస్టివ్ సీజన్ సేల్ తో ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయానికి గండి
అక్టోబర్ 16-21 మధ్య ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించగా, అమెజాన్ అక్టోబర్ 17 నుండి ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. 5-6 రోజుల వ్యవధిలో, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న వస్తువులను 80 శాతం వరకు రాయితీ ఇచ్చి విక్రయాలను సాగించనున్నారు . 10% నుండి 80% వరకు భారీ డిస్కౌంట్స్ ఇవ్వడం ద్వారా వస్తువులు వాస్తవ ధర కంటే చాలా తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. ఇది దోపిడీ ధర అని పేర్కొన్న సిఐఐటీ సాధారణ వస్తువుల వాస్తవ మార్కెట్ ధరపై వసూలు చేయాల్సిన జిఎస్టిని , ఇచ్చే డిస్కౌంట్లను తీసివేసిన తరువాత ధరపై వసూలు చెయ్యటం ప్రభుత్వానికి నష్టం అని పేర్కొంది .

ఫెస్టివల్ సీజన్ సేల్స్ ఆపాలని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ
ఈ ఇ-కామర్స్ పోర్టల్స్ ద్వారా కస్టమర్లకు కావాల్సిన వస్తువులను తక్కువ ధరకు ఇవ్వడం , తద్వారా ప్రభుత్వానికి జిఎస్టి ఆదాయాన్ని కోల్పోయేలా చెయ్యటమే అని సిఏఐటి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీన్ ఖండేల్వాల్ లేఖలో రాశారు. ఈ ఏడాది ఆరంభంలో వ్యాపార వ్యతిరేక పద్ధతులపై ట్రేడర్స్ పై సిసిఐ ఆదేశించిన దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చిన విషయం తెలిసిందే . దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన తరుణంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ కామర్స్ దిగ్గజాల ఫెస్టివ్ సీజన్ సేల్స్ ను ఆపాలని లేఖ వచ్చింది.

పండుగ సీజన్ సేల్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ కామర్స్ దిగ్గజాలు
పండుగ సీజన్ అమ్మకం అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లకు చాలా పెద్ద విషయం. గత ఏడాది, భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమకు చెందిన రెండు దిగ్గజాలు రికార్డు స్థాయిలో రూ .19,000 కోట్ల వస్తువులను విక్రయించాయి, ఇది 2018 గణాంకాలతో పోలిస్తే 30 శాతం వృద్ధిని సాధించినట్లు రెడ్‌సీర్ నివేదిక తెలిపింది. అయితే గతంలో ఇ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లోని అమ్మకందారులే ధర నిర్ణయించేవారని, ధర నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని , వాటిని కొనుగోలుదారులకు అందించటమే ఈ కామర్స్ సంస్థల ప్రాథమిక పని అని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications