భారత్ మా వ్యాపారాలను సర్వ నాశనం చేస్తోంది.. WTOలో ఫిర్యాదు చేసిన చైనా

భారతదేశం అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహన (EV), బ్యాటరీ సబ్సిడీ విధానంపై చైనా అధికారికంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద ఫిర్యాదు చేసిందని రాయిటర్స్ తెలిపింది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా ప్రయోజనం చేకూరుస్తోందని.. అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘిస్తోందని చైనా ఈ ఫిర్యాదులో ఆరోపించింది. బుధవారం, అక్టోబర్ 15, 2025న చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

చైనా ఆరోపణల ప్రకారం.. భారతదేశం ప్రకటించిన EV ప్రోత్సాహక పథకాలు, బ్యాటరీ తయారీ సబ్సిడీలు విదేశీ కంపెనీలను, ముఖ్యంగా చైనా తయారీదారులను పక్కనపెడుతూ దేశీయ తయారీదారులకు మాత్రమే లాభం చేకూరుస్తున్నాయి. ఇది చైనా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసే చర్య అని ఆ దేశం పేర్కొంది. WTOకి సమర్పించిన పత్రాల్లో భారత్ చర్యలు ఫ్రీ ట్రేడ్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని చైనా స్పష్టం చేసింది.

China WTO complaint India India EV subsidies electric vehicle policy India battery subsidy India China trade dispute India WTO India China conflict EV manufacturing incentives Make in India EV policy China vs India trade war WTO electric vehicle case India battery production subsidy India automotive sector news green energy trade dispute WTO complaint 2025 India renewable energy incentives WTO WTO WTO 2025

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. చైనా మంత్రిత్వ శాఖ భారత్ చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తన దేశ పరిశ్రమల హక్కులు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని చైనాకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో చైనాకు ప్రస్తుతం దాదాపు మూడింట రెండు వంతుల వాటా (సుమారు 66%)ఉంది. చైనా ప్రతి సంవత్సరం సుమారు 1.3 మిలియన్ యూనిట్ల EVలను విక్రయిస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశం కొత్త సబ్సిడీ విధానం చైనా ఉత్పత్తుల పోటీ శక్తిని తగ్గించవచ్చని ఆ దేశం భావిస్తోంది.

భారత ప్రభుత్వం ఇటీవల మేక్ ఇన్ ఇండియా ఫర్ ఈవీ పథకం కింద దేశీయ ఉత్పత్తి ప్రోత్సాహకాలు, బ్యాటరీ ఉత్పత్తి పీఎల్ఐ స్కీమ్, క్రిటికల్ మినరల్ రిజర్వ్ ప్రణాళిక (NCMS)లను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు దేశీయ ఈవీ పరిశ్రమలను బలోపేతం చేయడం, దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. చైనా ఫిర్యాదు చేసిన సమయానికే భారత ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్‌పైల్ (NCMS) ప్రోగ్రామ్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం దేశంలో అరుదైన భూమి ఖనిజాలు (rare earth minerals) లభ్యతను నిర్ధారించడం, వాటి నిల్వలు సృష్టించడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్‌లు, సౌర ప్యానెల్‌లు, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీల తయారీలో అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు.

కాగా డ్రాగన్ కంట్రీ China ప్రస్తుతం ప్రపంచంలో ఈ అరుదైన ఖనిజాల అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. భారత్ NCMS ప్రణాళిక ద్వారా వాటిపై ఆధారాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది.దీంతో చైనా వాణిజ్య ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుందని ఆ దేశం భావిస్తోంది. అయితే దీనిపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక స్పందన ఇప్పటివరకు వెలువడలేదు. అయితే ప్రభుత్వ వర్గాలు చెప్పిన ప్రకారం, భారతదేశం తీసుకున్న చర్యలు దేశీయ పరిశ్రమ అభివృద్ధికి, సస్టైనబుల్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని.. WTO నిబంధనలకు వ్యతిరేకంగా లేవని చెబుతున్నారు. నిపుణుల ప్రకారం..ఇది చైనా-భారత్ వాణిజ్య సంబంధాలలో కొత్త అధ్యాయం కావచ్చు. గతంలో కూడా రెండు దేశాలు సోలార్ ప్యానెల్స్, స్టీల్ దిగుమతులు వంటి అంశాలపై WTOలో గొడవ పడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+