Trade Talks Continue: రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు విధించిన సంగతి విదితమే. మొత్తం 50 శాతం టారిఫ్ అమలు చేయాలని నిర్ణయించారు ట్రంప్. అందులో 25 శాతం ఇప్పటికే అమల్లోకి తీసుకురాగా.. మిగతా 25 శాతం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. అయితే భారత్ మీద సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు చైనా విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఆరంభంలో డ్రాగన్ కంట్రీపై కూడా సుంకాల మోత మోగించిన ట్రంప్.. ఇప్పుడు ఆ దేశంతో వాణిజ్య చర్చలకు అదనంగా 90 రోజుల విరామం ప్రకటించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. చైనాతో వాణిజ్య విరామం పొడిగింపు గురించి బీజింగ్ కూడా తన అధికారిక మీడియాలో వెల్లడించింది. ఈ విరామం కారణంగా ఇరుదేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కోసం చర్చలకు 90 రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం.. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 145 శాతం వరకు టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించింది. దీనికి ధీటుగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలను అమలు చేస్తుందని తెలిపింది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న వేళ.. మే నెలలో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా దిగుమతులపై సుంకాలను 125 శాతం నుంచి 10 శాతానికి చైనా తగ్గించింది. అమెరికా కూడా చైనా దిగుమతులపై సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది. ఈ ఒప్పంద తగ్గింపు 90 రోజులు మాత్రమే అమల్లో ఉండేలా నిర్ణయించారు. ఈ గడువు మంగళవారం అర్థరాత్రి ముగియనుండగా, ట్రంప్ మరోసారి 90 రోజుల పొడిగింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్న చైనాపై కూడా ప్రతీకార సుంకాలు విధించాలా లేదా అన్న విషయంలో ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. రష్యా చమురు కొనుగోలు విషయం ఒక అంశం మాత్రమే. అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు.
చైనాపై సుంకాలు విధించని ట్రంప్ భారత్ మీద మాత్రం భారీగా సుంకాలు విధిస్తూ పోతున్నారు. ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడిలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.భారత్‌పై 50 శాతం టారిఫ్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్న అదనపు 25 శాతం సుంకం.. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే పలు రంగాల ఉత్పత్తులకు నేరుగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు భారత్‌పై కఠిన నిర్ణయాలు, చైనాకు అదనపు సమయం ఇవ్వడం వెనుక ట్రంప్ వ్యూహం ఏంటని పలువురు విశ్లేషించుకుంటున్నారు. ఈ వ్యూహం వచ్చే నెలల్లో ఆసియా-అమెరికా సంబంధాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
More From GoodReturns

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు.. అందువల్లే అనుమతి ఇచ్చామని తెలిపిన అమెరికా..

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..



Click it and Unblock the Notifications