ప్రపంచమంతా పరుగులు పెడుతోంది. ఒకరికి అందనంత వేగంగా మరొకరు పరిగెట్టే పరుగు పందెం జరుగుతున్నట్లు అన్నిట్లోనూ వేగమే. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఇది మరింత అధికం. దీనికి ఊతమిస్తోంది ఆటోమేషన్. సాధారణంగా పది మంది చేసే పనిని ఒక సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం ఎలా ఆటోమేట్ చేయగలిగిందో... సరిగ్గా అలాగే రెగ్యులర్ గా ఒకే తీరున జరగాల్సిన ఐటీ పనులను ఆటోమేట్ చేసేస్తున్నారు. ఉదాహరణకు టెస్టింగ్.
ఒకప్పుడు టెస్టింగ్ అంటే యమా క్రేజ్ ఉండేది. అలాంటిది అది దాదాపు పూర్తిగా ఆటోమేట్ అయిపోయింది. టెస్టింగ్ లోనూ ఇప్పుడు వినూత్న టెక్నాలజీలు వచ్చాయి. అవి నేర్చుకుని పనిచేస్తున్న వారికే పని. లేదంటే ఔట్. సో, ఐటీ రంగంలో వేగంగా మారిపోతున్న ఈ విధానాతో కొలువులు తగ్గిపోతాయని ఎప్పటినుంచో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
కానీ కొందరేమో అలాంటిదేమీ ఉండదని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు నిజంగానే ఆటోమేషన్ వల్ల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోయిందని రుజువైంది. మన దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీలు గత ఏడాది నియమించుకున్న నిపుణుల సంఖ్యను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది.

25% తగ్గిన కొలువులు...
సాఫ్ట్ వేర్ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, విప్రో, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా సంయుక్తంగా గత ఆర్థిక సంవత్సరంలో నియమించిన ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే ఆటోమేషన్ ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదు సంస్థలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో నికరంగా 87,060 మంది ఉద్యోగులను నియమించుకోగా... 2019-20 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఆ సంఖ్య 66,500 కి పడిపోయింది. అంటే ఐటీ నిపుణుల కొలువుల్లో 25% తరుగుదల నమోదయ్యింది.
పెరిగిన ఆటోమేషన్ ప్రభావం, అదే సమయంలో నెమ్మదించిన బిజినెస్ గ్రోత్ హైరింగ్ ను ప్రభావితం చేశాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ విషయాలను వెల్లడించింది. ఇండియన్ ఐటీ రంగంలో ఈ ఐదు సంస్థలే సుమారు నాలుగో వంతు ఉద్యోగాలు కల్పిస్తాయి. మన దేశంలో సుమారు 43 లక్షల మంది ఐటీ నిపుణులు ఉండగా... కేవలం ఈ ఐదు కంపెనీలే 11.4 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి.

బాడీ షాపింగ్ కుదరదు..
ఐటీ రంగం చాలా అడ్వాన్సుడ్ స్థాయికి చేరుకోవటంతో ఇక ఎంతమాత్రం బాడీ షాపింగ్ కుదరదని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక ప్రాజెక్టును సాధించేందుకు కేవలం అధిక సంఖ్యలో ఉద్యోగులను చూపించాల్సిన అవసరం తగ్గిపోతోంది. అదే సమయంలో క్లయింట్ ప్రాజెక్టు ను అత్యంత వేగంగా, అత్యంత సమర్థవంతంగా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పూర్తి చేస్తామన్న హామీ ఇవ్వాల్సి వస్తోంది.
ఇందుకోసం ఉద్యోగులు కొత్త తరహా టెక్నాలజీ లపై దృష్టి సారించాల్సి ఉంటోంది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఆటోమేషన్ మేళవించిన డిజిటల్ డెలివరీ సామర్థ్యాలు అందిపుచ్చుకోవాల్సి ఉంటోంది. అందుకే, కొత్తగా ఉద్యోగంలోకి తీసుకునే వారిని ఆయా కోర్సులు చేసిన వారినే ఎంపిక చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పాత సాంకేతిక పరిజ్ఞానం పై పనిచేస్తున్న వారికి సైతం కొత్త టెక్నాలజీల పై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు క్లయింట్ బిజినెస్ ప్రాబ్లెమ్ ను సాల్వ్ చేయగలిగే డిజిటల్ సేవలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

టీసీఎస్ టాప్...
దేశీయ ఐటీ రంగంలో ఏ రకంగా చూసినా టీసీఎస్ ముందు వరుసలో ఉంటుంది. ఉద్యోగుల నియామకం నుంచి బిజినెస్ వరకు అన్నింటా అది నెంబర్ వన్. ఈటీ కథనం ప్రకారం... టీసీఎస్ 2018-19 లో కొత్తగా 29,287 మంది ఉద్యోగులను తీసుకోగా.. 2019-20 లో 24,179 మందిని మాత్రమే నియమించుకుంది. ఇన్ఫోసిస్ అంతకు ముందటేడాది 24,016 మందికి కొలువులు ఇవ్వగా... 2019-20 లో ఆ సంఖ్య 14,248 కి పడిపోయింది. హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ లో 17,884 మంది ఉద్యోగ నియామకాలు జరగ్గా... 12,458 కి తగ్గాయి. టెక్ మహీంద్రా 2018-19 లో 8,275 మంది ఐటీ నిపుణులకు జాబ్స్ ఇవ్వగా... 2019-20 లో కేవలం 4,154 మందికి మాత్రమే జాబ్స్ ఇచ్చింది.
ఒక్క విప్రో మాత్రం ఈ విషయంలో మెరుగ్గా ఉంది. 2018-19 లో విప్రో 7,598 మందిని నియమించుకోగా.. ఆ సంఖ్య 11,461 కి పెరిగింది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ లో అత్యధిక ఆస్ట్రిషన్ రేటు ఇన్ఫోసిస్ లో 20.7% ఉండగా... టెక్ మహీంద్రా లో అది 19% గా ఉంది. టీసీఎస్ లో ఆస్ట్రిషన్ రేటు కేవలం 12.1% కాగా, విప్రో లో అది 14.7% గా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications