ఈరోజు భారత్ బంద్.. పనిచేసేవి..చేయనివి ఏంటో తెలుసుకోండి

మన పని మన జీవితమే కానీ ఆ జీవితానికే అసంతృప్తిగా మారుతోంది ఇదే గొంతుతో దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, మరియు అనేక రంగాల్లో పనిచేసే వేతనదారులు కోసం గళమెత్తుతున్నారు. జూలై 9న నిర్వహించబోయే ఈ భారత్ బంద్ కేవలం ఓ సాధారణ సమ్మె కాదు ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా వర్గాల ఆందోళనకు ప్రతిఫలంగా నిలుస్తోంది.

Bharat Bandh 2025 Employment Security Workers Rights Wage Protest India Middle Class Problems India Trade Union Strike Banking Disruptions Labour Law Reforms 2025

ఈ బంద్‌కు కారణమైన ప్రధాన అంశం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న "ప్రో-కార్పొరేట్ విధానాలు". కార్మిక సంఘాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" పేరిట తీసుకొస్తున్న నిర్ణయాలు కార్మిక వర్గాలను పక్కన పెట్టేలా మారాయని ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల భద్రత మరియు శ్రమ చట్టాల రక్షణను తగ్గిస్తూ కంపెనీలకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు గౌరవమైన జీవితం కూడా లభించడం లేదు, భద్రత కూడా ఉండటం లేదు.

ఈ బంద్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 10 కేంద్ర కార్మిక సంఘాల ఫోరం పిలుపునిచ్చింది. ఇందులో పలు కీలక రంగాలు భాగం బ్యాంకింగ్ రంగం, ఇన్సూరెన్స్ రంగం, పోస్టల్ సర్వీసులు, కోల్ మైనింగ్, హైవే నిర్మాణం, రవాణా రంగాలు, ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలు, రైతు సంఘాలు, గ్రామీణ కూలీలు తీసుకుంటున్నాయి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కి చెందిన అమర్జీత్ కౌర్ ప్రకారం, గ్రామీణ ప్రాంత రైతులు, కార్మికులు కూడా ఈ బంద్‌లో భాగం కానున్నారు. ఇది ఒక ఎత్తున నగరాల్లో ఉద్యోగుల చైతన్యం, మరో ఎత్తున గ్రామాల్లో రైతుల ఆక్రోశం.

వీరి డిమాండ్లు ఏమిటి?
ఈ సమ్మె తాలూకు డిమాండ్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయడం. MGNREGA పని దినాలు పెంపు & వేతనాలలో పెరుగుదల. నగరాల్లోనూ MGNREGA తరహా పథకాలు. కనీస వేతన భద్రత ఉండాలి. జనాభా ఆధారంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలి. ఉద్యోగ సంబంధిత ప్రోత్సాహక పథకం (ELI) పరశీలించి దీనిని కేవలం కంపెనీలకు మాత్రమే లాభం కాకుండా ఉద్యోగులకు సహకరించేలా మారాలి.

ఈరోజు జరగనున్న భారత్ బంద్‌ ప్రభావం ప్రధానంగా ఆర్థిక మరియు రవాణా రంగాలపై కనిపించేలా ఉంది. ఇప్పటికే బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రకటనలతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బెంగాల్ ప్రొవిన్షియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకారం, బ్యాంకులు ఈ బంద్‌కు మద్దతుగా తమ సేవలు నిలిపివేయనున్నాయి. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ATM‌లు పనిచేయకపోవచ్చు, కాష్ తీసుకునే ప్రక్రియలో అంతరాయాలు ఏర్పడవచ్చు. అలాగే, పోస్ట్ ఆఫీసుల పనితీరుపైనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ రవాణా సేవలు, స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు, ఫ్యాక్టరీలు కూడా బంద్ రోజున పనిచేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ దినచర్యలను ముందుగానే సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ బంద్ వెనక ఉన్న భావన చాలా లోతుగా ఉంది. ఇది కేవలం వేతనాలు పెంచాలని చేసే డిమాండ్ మాత్రమే కాదు. ఇది మధ్యతరగతి మరియు కార్మిక వర్గం ఎదుర్కొంటున్న జీవన సవాళ్లపై స్పందన. రైతుల ఆదాయం తగ్గిపోతుండటం, వైద్య సేవల ఖర్చులు పెరగటం, తల్లిదండ్రుల సంరక్షణ భారంగా మారటం, రోజువారీ సరుకుల ధరలు ఆకాశాన్ని తాకటం. ఇవన్నీ సామాన్య కుటుంబాన్ని నిత్యం ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పైగా, పని చేస్తున్న ఉద్యోగులకి గౌరవం తగ్గిపోతుండటం, భద్రతా చట్టాలు తక్కువ అవుతుండటం వలన భవిష్యత్తుపై భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, బంద్ చేస్తున్న ఉద్యమకారులు చెబుతున్న మాట ఇదే "మా పని మాకు గౌరవంగా ఉండాలి. మా జీవితం మాకు భద్రతగా ఉండాలి.

మరోవైపు, భారత్ బంద్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రం నుంచీ పాఠశాలలు లేదా కళాశాలలను మూసివేయాలని అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అందువల్ల, విద్యా సంస్థలు సాధారణంగా పనిచేసే అవకాశముంది. అలాగే, బ్యాంకులు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల తరఫున కూడా ఎలాంటి సెలవు ప్రకటించలేదు. అయినప్పటికీ, బ్యాంకింగ్ సేవలలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, వినియోగదారులు బ్యాంకుకు వెళ్లే ముందు సేవల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+