Gold Prices Today: బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు ఉదయం స్వల్పంగా పెరిగి, సాయంత్రానికి అదే స్వల్పస్థాయిలో తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7000 తక్కువగా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.400కు పైగా తగ్గినప్పటికీ, రూ.72వేలకు పైనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిగువన ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 28 డాలర్ల దిగువకు వచ్చింది.

స్థిరంగా బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.4.00 (0.01%) lidif రూ.49139.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,146.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,350.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,932.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.32.00 (0.06%) పెరిగి రూ.49453.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,387.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,589.00 గరిష్టాన్ని, రూ.49,261.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా తగ్గుదల
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.457.00 (0.64%) తగ్గి రూ.71360.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,606.00 వద్ద ప్రారంభమై, రూ.71,799.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,980.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.422.00 (0.58%) తగ్గి రూ.72535.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,724.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,900.00 గరిష్టాన్ని, రూ.72,200.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 1895 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.90 (0.21%) డాలర్లు తగ్గి 1,894.90 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,886.15 - 1,906.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.265 (0.95%) డాలర్లు తగ్గి 27.753 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.613 - 28.110 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications