క్యారట్‌లేన్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అదనంగా 27 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు టైటాన్ కంపెనీ లిమిటెడ్ శనివారం ప్రకటించింది. కంపెనీ క్యారట్‌లేన్ వ్యవస్థాపకుడు, అతని కుటుంబ సభ్యుల వద్ద ఉన్న 27.18 శాతం వాటాకొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపింది. కంపెనీ మొత్తం రూ.4,621 కోట్లతో అదనపు వాటాలను కొనుగోలు చేయనుంది.
ఈ ఒప్పందంతో క్యారట్‌లేన్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టైటాన్ వాటా 71.09 శాతం నుంచి 98.28 శాతానికి పెరుగనుంది. టైటాన్ అక్టోబర్ 31, 2023 నాటికి క్యారట్‌లేన్‌లో అదనపు వాటాల కొనుగోలును పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ లావాదేవీ సంప్రదాయ నియంత్రణ ఆమోదాలు, ముగింపు షరతులకు లోబడి ఉంటుంది.

నగదు నిల్వలు, అంతర్గత జమలు, రుణాల కలయిక ద్వారా ఫైనాన్స్ చేస్తున్నారని భావిస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,267 కోట్ల నుంతి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,177 కోట్ల టర్నోవర్‌ని కరాట్‌లేన్ నివేదించింది. క్యారట్‌లేన్ 2008లో స్వచ్ఛమైన ఆన్‌లైన్ బ్రాండ్‌గా ప్రారంభమైంది. టైటాన్ మొదటిసారిగా 2016లో క్యారట్‌లేన్‌లో పెట్టుబడి పెట్టింది.
గత ఎనిమిది సంవత్సరాలలో తనిష్క్ భాగస్వామ్యంతో, బ్రాండ్ వేగంగా అభివృద్ధి చెందింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో, కోవిడ్-ప్రభావిత సంవత్సరంలో తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, దాని అమ్మకాలు 74 శాతం CAGR వద్ద పెరిగాయి.


Click it and Unblock the Notifications