Budget 2020: ఆ మూడు అంశాలే కీలకం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. బడ్జెట్ 2020కి మూడు ముఖ్యమైన అంశాలను పిల్లర్స్‌గా తీసుకున్నామని చెప్పారు. ఆకాంక్షల భారత్, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమ సమాజం అనే అంశాలు కీలకమని వివరించారు.

ఆ మూడు అంశాలే కీలకం..
సమాజంలోని అన్ని వర్గాల మెరుగైన జీవన ప్రమాణాలను కోరుకునే ఆకాంక్షల భారతదేశం, అందరికీ ఆర్థికాభివృద్ధి, సంక్షేమ సమాజం అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రి తెలిపారు. ఆకాంక్షల భారతదేశంలో మూడు రంగాలు వస్తాయన్నారు. 1 వ్యవసాయం, ఇరిగేషన్, గ్రామీణ అభివృద్ధి, 2. మంచి నీరు, సానిటేషన్, 3 విద్య అంశాలు కీలకంగా ఉంటాయని చెప్పారు. వీటిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
జీఎస్టీ చారిత్రాక సంస్కరణ.. 16లక్షల మంది కొత్తగా..
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నరేంద్ర మోడీ ప్రభుత్వ తీసుకొచ్చిన చారిత్రాత్మక సంస్కరణ అని నిర్మల చెప్పారు. జీఎస్టీ భారతదేశాన్ని ఆర్థికంగా అనుసంధానం చేసిందని తెలిపారు. జీఎస్టీ రేటు తగ్గించడం వల్ల హైస్ హోల్డ్స్ నెల వ్యయంలో 4శాతం వరకు పొదుపు చేసుకుంటున్నారని ఆర్థిక మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో 16 లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లించేవారు కొత్తగా చేరారని చెప్పారు. 2006-2016 వరకు భారతదేశంలో 217 మిలియన్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని నిర్మలా సీతారామన్ వివరించారు.

అప్పులు తగ్గించాం..
ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ భారతదేశం మంచి ఆర్థికంగా నిలబడిందని చెప్పారు. ఈ బడ్జెట్ ముఖ్యంగా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ అప్పులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మార్చి 2014లో 52.2శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పు మార్చి 2019 నాటికి 48.7శాతానికి తగ్గించామని ఆర్థిక మంత్రి వివరించారు.

ఎఫ్ డీఐ భారీగా పెంచాం
2014-19 మధ్య కాలానికి జీడీపీ వృద్ధిరేటు 7.4శాతం పెట్టుకున్నామని, ద్రవ్యోల్బణం 4.5శాతంగా ఉందని తెలిపరాు. 2009-14 మధ్య కాలంలో 119 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ ఉండగా.. 2018-19నాటికి 284 బిలియన్ డాలర్లకు చేరుకుందని వివరించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి 16 యాక్షన్ పాయింట్లు తీసుకున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications