Nobel Prize: ఈ రోజు ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ అవార్డు ముగ్గురికి కలిసికట్టుగా దక్కింది. ఫెడరల్ రిజర్వ్ మాజీ చీఫ్ బెన్ బెర్నాంకేతో పాటు డగ్లస్ డైమండ్, ఫిలిప్ డైబ్విగ్ 2022 నోబెల్ ఎకనామిక్స్ బహుమతిని అందుకున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై వీరు చేసిన పరిశోధనకు గాను ఈ అవార్డును గెలుచుకున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం తెలిపింది.
బెన్ బెర్నాంకే ఒక పేపర్‌లో 1983 నుంచి స్టాటస్టికల్ అనాలసిస్, హిస్టారికల్ సోర్పెస్, బ్యాంకు పరుగులు వాటి వైఫల్యాలకు దారితీశాయని, అవి మాంద్యంగా మెుదలై తీవ్ర సంక్షోభాలుగా ఎలా మారాయనే దానిని వివరించారని ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి కమిటీ సభ్యుడు జాన్ హాస్లర్ అన్నారు.

మునుపటి గ్రహీతలలో ఎక్కువ మంది యునైటెడ్ స్టేట్స్ నుంచి ఉన్నారు. అయితే ఈ అవార్డును ఇప్పటి వరకు 2009లో ఎలినోర్ ఓస్ట్రోమ్, 2019లో ఎస్తేర్ డఫ్లో అనే ఇద్దరు మహిళలు మాత్రమే గెలుచుకున్నారు.
పారిశ్రామికవేత్త, డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 రాసిన వీలునామాలో అసలు ఐదు అవార్డుల్లో ఆర్థిక శాస్త్ర బహుమతి అనేది లేదు. ఇది స్వీడన్ సెంట్రల్ బ్యాంకు స్థాపించబడింది. 1969లో మొదటిసారిగా ఈ రంగానికి తొలిసారిగా ప్రదానం చేయటం జరిగింది.


Click it and Unblock the Notifications