For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

E Commerce: అదిరిపోయిన పండుగ సీజన్‌ సేల్‌.. భారీగా అమ్ముడుపోయిన మొబైల్స్..

|

దసరా పండుగకు ఈ కామర్స్ సేల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో భారీగా అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు దాదాపు రూ.40,000 కోట్ల విలువైన వస్తువులు, బట్టలు విక్రయాలు నమోదు చేశాయని రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టింగ్‌ నివేదిక అంచనా వేసింది. ఇ-కామర్స్‌ సంస్థలు పండుగ సీజన్‌ సేల్‌-1 గతేడాది కంటే ఎక్కువని పేర్కొంది. ఈ మొత్తం సుమారు 27 శాతం అధికమని వివరించింది.

41 శాతం
ప్రధానంగా ఈ సేల్ లో ఫోన్ల విక్రయాలు ఎక్కువగా జరిగిందని తెలిపింది. స్థూల మర్కండైజ్‌ విలువ (జీఎంవీ)లో మొబైల్ ఫోన్ల విభాగం వాటా 41 శాతం ఉందని చెప్పింది. అంటే గంటకు 56,000 మొబైల్స్‌ అమ్మకాలు జరిగాయని అంచనా వేసింది. సెల్‌ఫోన్ల అమ్మకాలు 7 రెట్లు పెరిగాయని వివరించింది. ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల విక్రయాలు 5 రెట్లు, ఇతర విభాగాల అమ్మకాలు 2 రెట్లు పెరిగినట్లు తెలిపింది.

 This time, business worth Rs.40,000 crores was done in this E commerce sales

డిస్కౌంట్లు, పండుగ
ఫ్యాషన్‌ ఉత్పత్తుల విభాగం వాటా మొత్తం జీఎంవీలో 20 శాతంగా ఉందని పేర్కొంది. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ విభాగ అమ్మకాలు 48 శాతం పెరిగినట్లు రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్‌ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ సంజయ్‌ కొఠారి చెప్పారు. విక్రయాలు ఎక్కువగా జరగడానికి పండుగతోపాటు డిస్కౌంట్లు కారణమని రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టింగ్‌ నివేదిక పేర్కొంది.

English summary

E Commerce: అదిరిపోయిన పండుగ సీజన్‌ సేల్‌.. భారీగా అమ్ముడుపోయిన మొబైల్స్.. | This time, business worth Rs.40,000 crores was done in this E commerce sales

This time Dussehra, the commerce sales were huge.. The report of Redseer Strategy Consulting estimated that the business worth Rs.40,000 crores was done.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X