ప్రపంచ బంగారం మార్కెట్‌లో మరోసారి కలకలం రేపే ప్రయత్నం చేస్తోంది చైనా. ఇప్పటివరకు కఠిన నియమాలతో బంగారం దిగుమతులు, ఎగుమతులు నియంత్రించిన ఈ దేశం, ఇప్పుడు వాటిని సడలించి పెద్ద మార్పుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఒక్క నిర్ణయమే చైనాలో బంగారం వ్యాపారం చేసే విధానాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది.
ఇప్పటి వరకు చైనాలో బంగారం దిగుమతులు, ఎగుమతుల కోసం కఠినమైన లైసెన్సింగ్ నియమాలు ఉండేవి. ఒక్కొక్క అనుమతి కోసం చాలా పేపర్ వర్క్, అనుమతుల కోసం వేచి చూడాల్సిన సమయం ఉండేది. ఇప్పుడు ఈ కఠినతను తగ్గించడానికి కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది.

ఈ కొత్త ప్రతిపాదనలో ప్రధాన ఆకర్షణ "మల్టీ-యూజ్ పర్మిట్లు". వీటి సహాయంతో ఒకే పర్మిట్‌ని పలు సార్లు ఉపయోగించవచ్చు. ఇక ప్రతిసారి కొత్త పర్మిట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఈ కొత్త ముసాయిదాలో మూడు పెద్ద మార్పులు చాలా కీలకంగా ఉన్నాయి. మొదటగా, ఇప్పటివరకు కొన్ని ముఖ్యమైన పోర్టులకే బంగారం పర్మిట్ల ప్రాసెసింగ్ అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని తీసేసి, మరిన్ని పోర్టులలో కూడా ఈ పర్మిట్లను ప్రాసెస్ చేయడానికి అవకాశం ఇవ్వబోతున్నారు. అంటే వ్యాపారులు ఇక దూర ప్రాంతాల పోర్టుల కోసం తిరగాల్సిన అవసరం తగ్గిపోతుంది.
రెండవది, ఒక్క పర్మిట్ ఇప్పటివరకు తక్కువకాలం మాత్రమే చెల్లేది. దాంతో ప్రతి కొన్ని నెలలకు మళ్లీ కొత్త పర్మిట్ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ గడువును తొమ్మిది నెలలకు పెంచాలని చూస్తున్నారు అంటే ఒకసారి పర్మిట్ తీసుకుంటే దాదాపు సంవత్సరం పాటు అదే పర్మిట్‌తో లావాదేవీలు చేయొచ్చు. మూడవది, ఒక పర్మిట్‌ను ఎన్నిసార్లైనా వాడొచ్చన్న పరిమితి కూడా ఇప్పటివరకు ఉండేది. ఆ పరిమితిని పూర్తిగా తొలగించనున్నారు. దీనివల్ల ఒకే పర్మిట్‌తో అవసరమైనన్ని సార్లు దిగుమతులు-ఎగుమతులు చేసుకోవచ్చు.
ఈ మార్పులు వస్తే, చైనా పోర్టుల్లో బంగారం లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారులకు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి, ఆలస్యాలు తగ్గుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే చైనాలో బంగారం వ్యాపారం మరింత "స్మూత్" అవుతుంది.
ఇది చైనాకు కొత్త దారిలో వేసిన తొలి అడుగు కాదు. 2016 లోనే PBOC బంగారం దిగుమతులు, ఎగుమతులపై ఉన్న అధిక అడ్డంకులను తగ్గించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రతిపాదన ఆ ప్రయత్నాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
PBOC చెప్పినట్టుగా, "పోర్టుల వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచి, చురుకుదనం పెంచడం, లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొస్తున్నారు. అంటే, ప్రపంచ మార్కెట్‌లో అనుకోని మార్పులు వచ్చినా కూడా చైనా బంగారం వాణిజ్యం ఆగిపోకుండా సాగిపోవాలని చూస్తున్నారు.
ఎందుకు బంగారంపై ఇంత దృష్టి?
చైనా బంగారంపై ఇంత దృష్టి పెట్టడానికి కూడా స్పష్టమైన కారణాలున్నాయి. ఇప్పటికే ఈ దేశం వరుసగా బంగారం నిల్వలను పెంచుకుంటూనే ఉంది. ఇది కేవలం చైనా ఒక్కటే చేస్తున్న పని కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా సెంట్రల్ బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడం, అలాగే యునైటెడ్ స్టేట్స్ డాలర్ దీర్ఘకాల స్థిరత్వంపై వస్తున్న అనుమానాలు. ఈ పరిస్థితుల్లో బంగారం మరింత భద్రమైన ఆస్తిగా కనిపిస్తోంది. అంతేకాదు, చైనా లోపల పెట్టుబడి ఉత్పత్తులుగా బంగారం బార్లు, నాణేలు కొనే డిమాండ్ కూడా చాలా బలంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది బంగారం ధరలు దాదాపు 40% వరకు పెరిగాయి దీనికి కూడా చైనా పెట్టుబడిదారుల ఆసక్తే ప్రధాన కారణాల్లో ఒకటి.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై అక్టోబర్ 13 వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. అంటే, వ్యాపారులు, దిగుమతిదారులు, ఇతర భాగస్వాములు తమ సూచనలు ఇవ్వొచ్చు. చైనా ఈ మార్పులు అమలు చేస్తే, ప్రపంచ బంగారం మార్కెట్‌లో చైనా ప్రభావం మరింత పెరగడం ఖాయం. బంగారం ధరలపైనా దీని ప్రభావం ఉండే అవకాశముంది.
చైనా గత 10 నెలలుగా ఒక్కరోజు కూడా ఆపకుండా వరుసగా బంగారం నిల్వలను పెంచుకుంటూనే ఉంది. ఒక్క 2025 ఆగస్టులోనే దాదాపు 1,700 కిలోల బంగారం కొనుగోలు చేసింది. అంతేకాదు, ఈ కొనుగోళ్లతో చైనా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. చైనా బంగారాన్ని ఇంత పెద్ద స్థాయిలో కొనుగోలు చేస్తుండటం కేవలం గ్లోబల్ మార్కెట్‌కే కాకుండా భారత్ పై కూడా ప్రభావం చూపకుండా ఉండదు. ఎందుకంటే భారత్ కూడా ప్రపంచంలోనే పెద్ద బంగారం వినియోగదారుల్లో ఒకటి. మన దేశంలో బంగారం ఎక్కువగా దిగుమతి చేస్తారు కాబట్టి, అంతర్జాతీయ ధరలు పెరిగితే దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు పెరగడం ఖాయం. అది సాధారణ వినియోగదారులకే కాకుండా, బంగారం ఆభరణాల వ్యాపారులు, పెట్టుబడిదారులపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, బంగారం దిగుమతుల బిల్లు పెరగడం వల్ల దేశపు కరెంట్ అకౌంట్ లోటుపై కూడా ఒత్తిడి పడే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications