ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో ఎన్నో అస్థిరతలు చోటుచేసుకున్నాయి. దీనికి ముఖ్య కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అని చెప్పవచ్చు. అయితే గత శుక్రవారం షేర్ మార్కెట్లో మంచి జోరు కనిపించింది. ఇక 2025 గురించి మాట్లాడుకుంటే, సెన్సెక్స్ రోజురోజుకి పతనమవుతూనే ఉంది. అలాగే ఈ క్షీణత కొన్ని షేర్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపకపోగా, వీటిలో స్థిరమైన పెరుగుదలని చూపిస్తుంది. ఇలాంటి ఒక స్టాక్ మల్టీబ్యాగర్‌గా మిగిలిపోయింది. దీని పేరు RDB రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్.

RDB షేర్లు కేవలం ఒక నెలలోనే దాదాపు 40 శాతం రాబడిని ఇచ్చాయి. అలాగే రెండు నెలల్లోపు ఇన్వెస్టర్ల డబ్బు రెట్టింపు చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ షేర్ ఎప్పటికప్పుడు అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది. ఇక శుక్రవారం కూడా ఈ స్టాక్ 2 శాతం అప్పర్ సర్క్యూట్ తో రూ.68.04 వద్ద ముగిసింది.
50 రోజుల్లో రెట్టింపు రాబడి: ఈ షేరు కేవలం 50 రోజుల్లోనే రెట్టింపు రాబడిని ఇచ్చింది, అంటే పెట్టుబడిదారుల పెట్టుబడిని డబుల్ చేసింది. ఫిబ్రవరి 21న ఈ షేర్ ధర రూ.33.87, కానీ ఇప్పుడు రూ.68.04గా ఉంది. అంటే ఫిబ్రవరి 21 నుండి ఇప్పటివరకు చూస్తే దాదాపు 50 రోజుల్లో 100 శాతం రాబడి ఇచ్చింది. గత రెండు నెలల గురించి మాట్లాడుకుంటే దీని రిటర్న్ 200 శాతానికి పైగా ఉంది. రెండు నెలల క్రితం అంటే ఫిబ్రవరి 11న దీని ధర దాదాపు రూ.20 ఉండగా ఏప్రిల్ 11న ఈ షేరు రూ.68.04కి చేరుకుంది. ఈ రెండు నెలల్లో సుమారు 240 శాతం రిటర్న్ ఇచ్చింది.
PPF: ప్రతి నెలా 5 వేల రూపాయల పెట్టుబడితో రూ.16 లక్షలు సంపాదించ్చొచ్చు..!
ఒక లక్ష నుండి 5 లక్షలు సంపాదన: ఈ స్టాక్ చాలా తక్కువ సమయంలోనే పెట్టుబడిదారులకు భారీ రాబడిని ఇచ్చింది. మనం 100 రోజుల గురించి మాట్లాడుకుంటే ఈ రాబడి 400 శాతంగా ఉంది. ఈ షేరు 30 జనవరి 2025న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. జనవరి 31న దీని ధర రూ.13.54 ఇప్పుడు రూ.68.04. జనవరి 31 నుండి ఇప్పటివరకు దాని రాబడి 402 శాతంగా ఉంది. మీరు జనవరి 31న అందులో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ మొత్తం ఇప్పుడు రూ.5 లక్షలకు పెరిగి ఉండేది. అంటే, ఈ 100 రోజుల్లోనే మీరు రూ. లక్ష పెట్టుబడిపై రూ. 4 లక్షల లాభం పొంది ఉండేవారు.
మార్కెట్ క్యాప్ ఎంత: ఈ కంపెనీ 2018లో స్థాపించబడింది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినది. ఈ కంపెనీ RDB గ్రూప్‌లో భాగం. ఈ కంపెనీ రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్ రంగాలలోని ప్రాజెక్టుల్లో వ్యవహరిస్తుంది. BSE అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.117.60 కోట్లు.


Click it and Unblock the Notifications