ఈ భారతీయ సీఈవోకు ఎలాన్ మస్క్ తరహా అద్భుతమైన ప్యాకేజీ
ఇండియన్ సీఈవో ఒకరు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరహా ప్యాకేజీని సొంతం చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ వివిధ మైల్ స్టోన్స్‌ను అందుకుంటే సదరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జగ్‌దీప్ సింగ్ 2.3 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ఆప్షన్స్‌ను పొందుతారు. బ్యాటరీ స్టార్టప్ క్వాంటమ్ స్కేప్ కార్పోరేషన్ షేర్ హోల్డర్లు మల్టీబిలియన్ డాలర్స్ ప్యాకేజీని ఆమోదించారు. అయితే కంపెనీ వివిధ మైలురాళ్లను చేరుకుంటే ఈ కంపెనీ సీఈవో జగ్‌దీప్ సింగ్ 2.3 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ఆప్షన్స్ పొందవచ్చును. క్వాంటమ్ స్కేప్స్ వార్షిక షర్ హోల్డర్స్ సమావేశం బుధవారం వెబ్ కాస్ట్ ద్వారా జరిగింది. ఈ మేరకు ప్యాకేజీకి ఓటు వేశారు.
వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్స్‌లలో భారీ చెల్లింపులు, ప్యాకేజీలు సర్వసాధారణంగా మారుతున్నాయి. టెస్లా ఇంక్ తన ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి ఒప్పందంతో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రపంచ సంపన్నుడిగా మారడానికి దోహదపడింది. కనీసం పదిహేనుమంది కార్పోరేట్ నాయకులు గత ఏడాది 100 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన అవార్డ్స్ అందుకున్నారు. ఇది 2018లో ఎలాన్ మస్క్ అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ.

సవాళ్లు, కష్టసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి తాము అనుకూలంగా ఉన్నామని, వాటిని సాధించే అంశంపై దృష్టిలో పెట్టుకున్నామని ప్యాకేజీని సమర్థిస్తూ వాటాదారులకు రాసిన లేఖలో క్వాంటమ్ స్కేప్ పేర్కొంది. లక్ష్యాలను అందుకోవడానికి ఈ దిశగా అడుగు వేశామన్నారు. వోక్స్ వాగన్ ఏజీ, బిల్ గేట్స్ వెంచర్ ఫండ్ బ్యాక్డ్ క్వాంటమ్ స్కేప్ గత ఏడాది 50 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌కు చేరుకుంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీకి సురక్షిత, చవకైన ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా ఈవీ అడాప్టేషన్‌ను వేగవంతం చేస్తుంది.


Click it and Unblock the Notifications