గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించగా.. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది నా వలనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ అయింది. అయితే మళ్లీ ఇప్పుడు కూడా ట్రంప్ పాత రాగాన్ని ఆలపించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు అణ్వాయుధాల వినియోగం గురించి కూడా ఆలోచించే స్థితికి వెళ్లాయని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఎనిమిది యుద్ధ విమానాలు కూల్చివేశారని.. పరిస్థితి అదుపు తప్పితే భారీ విపత్తు తప్పదని తాను భావించానని తెలిపారు. తన జోక్యం వల్లే ఆ ఘర్షణ పెద్ద యుద్ధంగా మారకుండా ఆగిపోయిందని ట్రంప్ స్పష్టం చేశారు.

తాను అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం పది నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పెద్ద యుద్ధాలను ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ జాబితాలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ సంఘర్షణ అత్యంత ప్రమాదకరమైనదిగా ఆయన అభివర్ణించారు. రెండు దేశాలు అణ్వస్త్రాలతో సన్నద్ధంగా ఉండటంతో.. ఈ యుద్ధం మొదలైతే లక్షలాది కాదు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేదని చెప్పుకొచ్చారు.
గత ఏడాది వాషింగ్టన్‌కు వచ్చిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో మాట్లాడుతూ.. ట్రంప్ జోక్యం వల్ల కనీసం కోటి మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని చెప్పారని అధ్యక్షుడు వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలే కావడంతో.. ఆ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారేదో ప్రపంచం అర్థం చేసుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.
నోబెల్ శాంతి బహుమతి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తన విదేశాంగ విధాన విజయాలు వ్యక్తిగత అవార్డులకంటే ముఖ్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, తాను ఆపిన యుద్ధాల సంఖ్యను ప్రస్తావిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా మొదలై ఉంటే లక్షలాది మంది ప్రాణాలు పోయేవని అన్నారు. భారత్-పాకిస్తాన్ ఘర్షణ విషయంలో అయితే 10 నుంచి 20 మిలియన్ల మంది వరకు ప్రాణనష్టం జరిగేదని, తన చర్యల వల్లే ఆ విపత్తు తప్పిందని తెలిపారు.
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణను వైట్ హౌస్ కూడా ట్రంప్ పాలనలోని ప్రధాన విజయంగా పునరుద్ఘాటించింది. ట్రంప్ రెండో పదవీకాలానికి ఏడాది పూర్తైన సందర్భంగా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో.. న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం వహించడం ట్రంప్ పరిపాలన సాధించిన కీలక ఘనతలలో ఒకటిగా పేర్కొంది.
365 రోజుల్లో 365 విజయాలు అనే శీర్షికతో విడుదల చేసిన ఈ నివేదికలో.. ట్రంప్ 2.0 తొలి సంవత్సరం ఆధునిక అమెరికా చరిత్రలోనే అత్యంత ఫలితాలు ఇచ్చిన ఏడాదిగా అభివర్ణించారు. వలసల తగ్గుదల, నేరాల తగ్గింపు, భారీ పెట్టుబడులు, శాంతి ఒప్పందాలు, ఇంధన ఉత్పత్తి పెరుగుదల వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. ప్రపంచ వేదికపై అమెరికా నాయకత్వాన్ని తిరిగి స్థాపించడంలో భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి ప్రయత్నాలు కీలకమని వైట్ హౌస్ పేర్కొంది.
ఇక Trump వాదనలను భారత్ మాత్రం నిరంతరం తిరస్కరిస్తూ వస్తోంది. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, దానికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు భారత అధికారులు వివరించారు. ఆ తరువాత మే 10న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్వయంగా భారత అధికారులను సంప్రదించి కాల్పుల విరమణ కోరినట్లు స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షికంగా కుదిరిందని.. ఇందులో ఎలాంటి మూడో పక్షం పాత్ర లేదని మోదీ ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ట్రంప్ ఈ అంశాన్ని ఇప్పటివరకు దాదాపు 90 సార్లు ప్రస్తావించినప్పటికీ, భారత ప్రభుత్వం తన మాట నుంచి వెనక్కి తగ్గలేదు. అధికారికంగా ఖండిస్తూ వచ్చింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ రేట్ల పెంపులో పాకిస్థాన్ సరికొత్త రికార్డు.. లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications