IPOs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ జాతర కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ మినహాయిస్తే- పబ్లిక్ ఇష్యూకు వచ్చినవన్నీ ఎస్ఎంఈ ఐపీఓలే. క్రమంగా స్టాక్ మార్కెట్ మొత్తాన్నీ ఇవి డామినేట్ చేస్తోన్నాయి.
ప్రస్తుతం మూడు ఎస్ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ మూడూ కలిపి 136 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేయనున్నాయి. ఈ మూడింటిపైనా మార్కెట్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అలాట్ అయిన ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచుతాయని భావిస్తోన్నాయి. దీనికి అనుగుణంగా వాటి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా లాభాలను సూచిస్తోన్నాయి.

1 ఎయిమ్‌ట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్: ప్రస్తుత్తం ఈ ఎస్ఎంఈ ఐపీఓ ఓపెన్ అయింది. సోమవారం నాటితో ముగియనుంది. మొత్తంగా 87 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేసిందీ కంపెనీ. కనీస లాట్ సైజు 800 షేర్లు. అంటే 800 కంటే తక్కువగా షేర్లను దాఖలు చేయలేం. 1,22,800 రూపాయలను కనీస మొత్తంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
దీని జీఎంపీ 66 రూపాయలుగా ఉంటోంది. లిస్టింగ్ నాడు ఒక్కో షేర్ మీద 66 రూపాయలను అధిక ప్రీమియం పలుకుతుంది. 4వ తేదీన అలాట్‌మెంట్, అలాట్ కాని వారికి 5వ తేదీన రీఫండ్ చేస్తుందీ సంస్థ. అలాట్ అయిన వారికి అదే రోజున షేర్లను వారి డీమ్యాట్ ఖాతాల్లోకి బదలాయిస్తుంది. 6వ తేదీన స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అవుతుంది.
2. అసోసియేటెడ్ కోటర్స్ లిమిటెడ్: ప్రస్తుత్తం ఈ ఎస్ఎంఈ ఐపీఓ ఓపెన్ అయింది. సోమవారం నాటితో ముగియనుంది. మొత్తంగా 5.1 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేసిందీ కంపెనీ. కనీస లాట్ సైజు 1,000 షేర్లు. అంటే 1,000 కంటే తక్కువగా షేర్లను దాఖలు చేయలేం. 1,21,000 రూపాయలను కనీస మొత్తంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
దీని జీఎంపీ 21 రూపాయలుగా ఉంటోంది. లిస్టింగ్ నాడు ఒక్కో షేర్ మీద 21 రూపాయలను అధిక ప్రీమియం పలుకుతుంది. 4వ తేదీన అలాట్‌మెంట్, అలాట్ కాని వారికి 5వ తేదీన రీఫండ్ చేస్తుందీ సంస్థ. అలాట్ అయిన వారికి అదే రోజున షేర్లను వారి డీమ్యాట్ ఖాతాల్లోకి బదలాయిస్తుంది. 6వ తేదీన స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అవుతుంది.
3. టీబీఐ కార్న్ లిమిటెడ్: ప్రస్తుత్తం ఈ ఎస్ఎంఈ ఐపీఓ ఓపెన్ అయింది. మంగళవారం నాటితో ముగియనుంది. మొత్తంగా 55.9 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేసిందీ కంపెనీ. కనీస లాట్ సైజు 1,200 షేర్లు. అంటే 1,200 కంటే తక్కువగా షేర్లను దాఖలు చేయలేం. 1,08,000 రూపాయలను కనీస మొత్తంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
దీని జీఎంపీ 95 రూపాయలుగా ఉంటోంది. లిస్టింగ్ నాడు ఒక్కో షేర్ మీద 21 రూపాయలను అధిక ప్రీమియం పలుకుతుంది. 5వ తేదీన అలాట్‌మెంట్ ఉంటుంది. అలాట్ కాని వారికి 6వ తేదీన రీఫండ్ చేస్తుందీ సంస్థ. షేర్లు అలాట్ అయిన వారికి అదే రోజున షేర్లను వారి డీమ్యాట్ ఖాతాల్లోకి బదలాయిస్తుంది. 7వ తేదీన స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications