independence day news: ప్రతి రంగంలోనూ స్వయం సమృద్ధి దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి పలు ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంస్కరణలు ఇందుకు ప్రముఖ కారణం. కేవలం పాలకులు మాత్రమే కాకుండా ఆయా కంపెనీలు కూడా దేశ స్వావలంబన విషయంలో కీలక పాత్ర పోషించాయి.
అమూల్:
భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో బ్రిటీష్ కాలం నుంచీ సేద్యంతో పాటు దాని అనుబంధ పశుపోషణకు పాలకులు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు. దీంతో 19వ శతాబ్ధంలోనే భారత్ ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. కానీ ఆ లెగసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన సంస్థగా అమూల్‌ను చెప్పుకోవచ్చు. కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘంగా 1946లో ఈ కంపెనీ ప్రారంభమైంది. తర్వాత దానికి అమూల్ గా పేరు మార్చారు. కాల క్రమేణా దేశంలోని ఇతర పాల ఉత్పత్తి కంపెనీలకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ పాల ఉత్పత్తి రంగంలో అత్యుత్తమ సంస్థగా సేవలందిస్తోంది.

పార్లే:
పిల్లలు ఎక్కువ మక్కువ చూపించే బిస్కెట్లు, చాక్లెట్ల తయారీలో పార్లే స్వాతంత్ర్యం ముందు నుంచే నిమగ్నమైంది. 1929లో మోహన్‌లాల్ దయాళ్ చౌహాన్ స్వదేశీ ఉద్యమానికి నాంది పలికారు. ఇందులో భాగంగా ముంబైలోని విల్లే బార్లేలో ఒక చిన్న ఫ్యాక్టరీని స్థాపించారు. ఆయన గౌరవార్థం కంపెనీకి పార్లే అని పేరు పెట్టారు. 1939లో బిస్కెట్ల తయారీని ప్రారంభించి ఇప్పటికీ మార్కెట్లో మంచి పొజిషన్‌లో ఉంది.
మారుతి సుజుకీ:
కేవలం ధనికులు మాత్రమే అప్పట్లో కార్లలో తిరిగేవారు. పేద, మధ్యతరగతికి కారు అంటే దూరం నుంచి చూసి ఆనందపడే ఉత్పత్తిగా ఉండేది. మారుతీ సుజుకి రంగంలోకి దిగిన తర్వాత ప్రజల్లో వాటి కొనుగోలు శక్తి పెంచింది. తన మొదటి కారు మారుతి 800ని 50 వేలకు విడుదల చేసింది. దీని తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు. శ్రీమంతులను మాత్రమే కాకుండా మధ్యతరగతి వారిని కూడా దృష్టిలో పెట్టుకుని తయారు చేసే కార్లకు ఇప్పటికీ భారతీయులు బ్రహ్మరథం పడుతున్నారు.
డాబర్:
కోల్‌కతాకు చెందిన వైద్యుడు SK బర్మన్ ఆయుర్వేద మందులు ఇవ్వడంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. 1880లలో ఆయన తయారుచేసిన మందులు వివిధ వ్యాధులను నయం చేసేవి. దీంతో గ్రామస్తులు ఆయనను 'దక్తుర్ బర్మన్' అని పిలిచేవారు. తరువాత ఆయన స్టార్ట్ చేసిన కంపెనీకి 'డాబర్' అని పేరు పెట్టారు. 1884లో ప్రారంభమైన డాబర్ ప్రయాణం.. దేశంలోని ఆయుర్వేద ఔషధ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెడుతూ, అద్భుతమైన వృద్ధిని సాధించింది.
బాటా:
చెక్ రిపబ్లిక్‌లో ప్రస్థానం ప్రారంభించిన బాటా కంపెనీ మొదట 1931లో కోల్‌కతాలో తన మొదటి స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీని గౌరవార్థం ఈ ప్రాంతం పేరు బాటా నగర్‌గా మార్చబడింది. భారతీయులు అత్యధికంగా ఇష్టపడే పాదరక్షల తయారీ బ్రాండ్ ఇది. కాలక్రమంలో ఎన్ని షూ బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చినా బాటా అంటే ఇండియన్స్‌కు ప్రత్యేక గౌరవం.
సిప్లా:
బ్రిటిష్ వలస పాలనలో దేశీయ వైద్య పరిశ్రమ విదేశీ కంపెనీల కబంధ హస్తాల్లో ఉండేది. ఇక్కడ తయారయ్యే చాలా ఔషధాలకు సదరు సంస్థల నుంచి అనుమతి లభించేది కాదు. మందుల కోసం విదేశాలపై ఆధారపడవలసి వచ్చేది. ఆ సమయంలో డాక్టర్ యూసుఫ్ హమీద్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో PhD పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక్కడ సిప్లా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించారు. వివిధ ఔషధాలు లైసెన్సులు పొందేలా భారతీయ కంపెనీలకు పునాది వేసింది.
హీరో:
చిన్ననాటి జ్ఞాపకాల్లో నాన్న హీరో సైకిల్‌పై సవారీ దాదాపు అందరికీ గుర్తుండే ఓ మధుర అనుభూతి. 1956లో ఓపీ మంచాల్ ఈ సైకిల్ కంపెనీని ప్రారంభించారు. పంజాబ్ రాష్ట్రంలో రిపేర్ షాపుగా ప్రారంభమైన సంస్థ.. తదనంతర కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా ఎదిగింది. అనంతరం క్రమంగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం హీరో మోటార్ కార్ప్ పేరుతో భారతీయుల హృదయాలను కొల్లగొడుతున్న ద్విచక్ర వాహన సంస్థగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications