బంగారం లేటెస్ట్ రేట్లు ఇవే.. ఈ అక్షయ తృతీయకు బంగారం ధరలు మరింత ప్రియం!!
అక్షయ తృతీయ దగ్గరికి వస్తోంది. అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు బంగారం ధరలు తగ్గుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే బంగారం ధరలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రస్తుతం 62,000 దగ్గరగా ఉన్న బంగారం ధరలు రానున్న రోజుల్లో 70 వేల రూపాయలకు చేరుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక తాజాగా దేశంలో బంగారం ధరల విషయానికి వస్తే నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్న కాస్త తగ్గిన బంగారం ధరలు ప్రస్తుతం అవే ధరలను కొనసాగిస్తున్నాయి. దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 55,940 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 61 వేల 030 రూపాయలు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి.

హైదరాబాద్లో బంగారం ధరల విషయానికొస్తే నేడు హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,940 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 030 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,090 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,180గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,940 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,030 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,990 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 080 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, రాజమండ్రి, కాకినాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,940 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,030 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది


Click it and Unblock the Notifications