Pan-Aadhar link: పాన్-ఆధార్ లింకింగ్ కోసం ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. గతంలో మార్చి 31, 2023 చివరి తేదీగా నిర్ణయించగా.. దానిని ఇప్పుడు జూన్ 30, 2023 వరకు పొడిగించారు. అయితే ఈ ప్రక్రియలో, ఆధార్‌తో పాన్ కార్డు తప్పుగా జత చేయబడితే ఏం చేయాలో తెలుసా? పాన్ నుంచి ఆధార్‌ను ఎలా డీలింక్ చేయాలో తెలుసుకోండి మరి..
తప్పుగా లింక్ అయితే..
ప్రస్తుతం అనేకమంది ఈ తరహా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా పాన్-ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను ఈ సమస్య వేధిస్తోంది. దీనిని సరిచేసుకుని, సరైన పాన్ మరియు ఆధార్ లింక్‌ను ప్రాసెస్ చేయడానికి.. మొదట తప్పుగా నమోదైన పాన్‌ను డీలింక్ చేయాలి. ఆపై రెండు డాక్యుమెంట్‌లను మళ్లీ జతే చేస్తే సరి.
ఈ సందర్భాల్లో ఏం చేయాలంటే..
పాన్-ఆధార్ డీలింకింగ్ కోసం పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫిర్యాదు, చిరునామా ధ్రువీకరణ, ఇ-మెయిల్ ను విధిగా దగ్గర ఉంచుకోవాలి. అనంతరం వివిధ సందర్భాల్లో ఏ విధంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలో చూద్దాం..

ఒకే పాన్ నంబర్ కలిగి ఉంటే:
సర్వీస్ ప్రొవైడర్ నుంచి పాన్ కార్డు ప్రాసెసింగ్ వివరాలను సేకరించాలి. మొదటి, తదనంతర కేటాయింపుదారుల గుర్తింపు కోసం రిక్వెస్ట్ చేయాలి. అవసరమైన పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత కేటాయింపుదారులు కొత్త పాన్ కార్డుని అందుకోవచ్చు.
ఒక వ్యక్తికి రెండు పాన్ కార్డులను ఉండి, డీయాక్టివేట్ అయిన కార్డుకి ఆధార్ లింక్ అయితే:
పాన్ కార్డు స్థితిని తనిఖీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ మొబైల్ అప్లికేషన్‌లోని CBN ప్రశ్నను ఉపయోగించాలి. రెండు కార్డులు యాక్టివ్‌గా ఉంటే, అవి ఇప్పటికే డీ-డూప్లికేషన్‌లో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. అదే జరిగితే, ఆదాయపు పన్ను అసెస్సింగ్ అధికారిని సంప్రదించాలి. ఇందుకోసం అవసరమైన పత్రాలను ఆ శాఖకు సమర్పించాలి.

ఒక వ్యక్తి పాన్ కార్డు మరొకరి ఆధార్‌తో లింక్ చేయబడితే:
పాన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కార్డు ప్రాసెసింగ్ వివరాలను పొందాలి. RCC (ప్రాంతీయ కంప్యూటర్ సెంటర్) ద్వారా ITBA (ఆదాయ పన్ను వ్యాపార అప్లికేషన్) నుంచి ఆడిట్ లాగ్ సేకరించాలి. అవసరమైన పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు అందించాలి.
జురిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)కి డీలింక్ అభ్యర్థన సమర్పణ:
ఇ-ఫిల్లింగ్ పోర్టల్ ప్రకారం, ఆధార్ తప్పు పాన్‌కి లింక్ చేయబడినప్పుడు డీలింక్ చేయడం కోసం JAOకి అభ్యర్థన సమర్పించవచ్చు. అనంతరం తిరిగి సరైన వాటిని జత చేసేందుకు మరోసారి రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్దేశిత ఫీజు చెల్లించాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications