మూడే రోజుల్లో 2.5 లక్షల కోట్లకు పైగా వసూళ్లు: ఇదీ సార్ స్టాక్ మార్కెట్ సత్తా
ముంబై: ఈ వారం మొత్తం కూడా స్టాక్ మార్కెట్‌లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సందడి కనిపించింది. ఏకంగా అయిదు ఐపీఓలు ఒకే తేదీన మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చాయి. లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఐపీఓను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఆరుకు చేరుతుంది.
టాటా టెక్నాలజీస్ (Tata technologies), గాంధార్ ఆయిల్ రిఫైనరీ (Gandhar Oil refinery), ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీ (Flair writing), ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Fedbank financial services), ఎస్ఎంఈ సెగ్మెంట్‌లో రాకింగ్ డీల్స్ సర్కులర్ ఎకానమీ లిమిటెడ్.. తమ పబ్లిక్ ఇష్యూలను జారీ చేశాయి. అవన్నీ కూడా ఈ నెల 22వ తేదీన ఓపెన్ అయినవే. 24వ తేదీన క్లోజ్ అయ్యాయి.

ఈ మూడు రోజుల వ్యవధిలో ఈ అయిదు ఐపీఓలు రాబట్టుకున్న ఇన్వెస్ట్‌మెంట్ విలువ.. 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఇదో రికార్డు. పబ్లిష్ ఇష్యూలను జారీ చేయడం ద్వారా ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను సమీకరించిన మరో ఐపీఓలు ఈ మధ్యకాలంలో లేవు.

రాకింగ్ డీల్స్ సర్కులర్‌ను పక్కనపెడితే మిగిలిన మూడు రెగ్యులర్ పబ్లిక్ ఇష్యుల్లో టాటా టెక్నాలజీస్ టాప్‌లో నిలిచింది. ఇష్యూ చేసిన వేల్యూ కంటే 69.43 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిందీ సంస్థ. దీని విలువ 1.56 లక్షల కోట్ల రూపాయలు. 4.5 కోట్ల పబ్లిక్ ఇష్యూలను జారీ చేయగా 312 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి.

టాటా టెక్‌పై ప్రజల్లో ఉన్న బలమైన విశ్వాసం, 19 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఐపీఓను జారీ చేయడం దీనికి కారణాలుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. టాటా టెక్నాలజీస్‌తో పోటీ పడింది గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఐపీఓ. ఇష్యూ చేసిన మొత్తం కంటే 64.07 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్‌ను రికార్డు చేసింది. 2.12 కోట్ల షేర్లను జారీ చేయగా.. 136.1 కోట్లకు బిడ్డింగులు దాఖలయ్యాయి. వీటి విలువ 23,000 కోట్ల రూపాయలు.

ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో నిలిచింది. 46.68 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్లను నమోదు చేసింది. 1.44 కోట్ల షేర్లను ఈ సంస్థ జారీ చేయగా.. 67.28 కోట్ల షేర్లు బుక్ అయ్యాయి. వీటి విలువ 20,400 కోట్ల రూపాయలు. ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ 1,720 కోట్ల రూపాయల విలువ చేసే సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది.


Click it and Unblock the Notifications