PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోకి రూ.2 వేలు..!
రైతులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. పీఎం కిసాన్ 24 విడతకు సంబంధించి ఈ నెలలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం 2019లో తీసుకొచ్చింది. రైతులకు సాయం చేసేందుకు ప్రతి సంవత్సరం రూ.6000 అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. మూడు విడతలుగా రూ.2000 చొప్పున్న ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు అన్నదాతల ఖాతాల్లో 23 విడతలుగా రూ.46 వేలు జమ చేసింది. 24వ విడత అక్టోబర్ నెల ముగిసేలోపు రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే దసరాకు ముందే పీఎం కిసాన్ 24వ విడత విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2000 జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 24వ విడత పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ కావాలంటే.. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అంతే కాదు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఎవరైనా రైతులు ఈకేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోకుంటే.. వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం ఏఈఓను సంప్రదించవచ్చు.

ఈ కేవైసీ కోసం మీ సేవకు వెళ్లి చేసుకోవచ్చు. లేదా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు సరిపోవడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి కేవలం రూ.6 వేలే ఇస్తున్నారని రైతులు సంఘాలు చెబుతున్నాయి. అప్పటికి నుంచి ఇప్పటి వరకు అన్ని ధరలు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఎరువుల ధరలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. విత్తనాల ధరలు కూడా పెరిగాయని వివరిస్తున్నారు. కూలీ ధరలు కూడా పెరిగినట్లు చెబుతున్నారు. అందుకే పీఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బడ్జెట్ లో పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచుతారని ప్రచారం జరిగింది. కానీ బడ్జెట్ లో పీఎం కిసాన్ నిధుల పెంపు గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికైనా పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలను రూ.12 వేలకు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రైతు భరోసా, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు సాయం అందుతోంది. రైతు భరోసా కింద తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేలు ఇస్తోంది. వర్షాకాలం సీజన్ కు సంబంధించి ఎకరాకు రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు అందిస్తోంది. అయితే ఇందులో పీఎం కిసాన్ రూ.6 వేలు పోను.. మిగతా రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications