Rythu Bharosa: రైతులకు శుభవార్త.. మూడో విడత రైతు భరోసా విడుదల..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేస్తోంది. గురువారం మూడో విడత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మూడో విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్న అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు వివరించారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 61, 35 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో రూ.5,402,37 కోట్లను జమ చేశారు.

జూన్ 30 తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రులు నిధులు విడుదల చేశారు. మొదటి దశలో భాగంగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేశారు. బుధవారం రెండో విడతలో భాగంగా 2 నుంచి మూడు ఎకరాలు ఉన్న 10.68 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.1590 కోట్లు జమ అయింది. 26.50 లక్షల ఎకరాలకు రెండో విడత రైతు భరోసా విడుదల చేశారు.

rythu bharosa

రైతు భరోసా కింద మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా 73.32 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి రైతు భరోసా మూడో విడత నిధులు జమ చేసే అవకాశం ఉంది. రైతులకు ఇబ్బంది లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు తుమ్మల చెప్పారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో ఎకరాకు రూ.10 ఇచ్చేవారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు బంధును రైతు భరోసా మార్చి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు ఎకరాకు రూ.12 వేలకు పెంచింది. అయితే ఇచ్చిన హామీ ప్రకారం రూ.15 వేలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత యాసంగి సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేవలం 2 ఎకరాల వరకే రైతు భరోసా నిధులు జమ చేసి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+