Rythu Bharosa: రైతుల ఖాతాల్లో రూ.12 వేలు జమ.. వెంటనే చెక్ చేసుకోండి..!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రులు నిధులు విడుదల చేశారు. మొదటి దశలో భాగంగా రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేశారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9 వేల కోట్లను దశలవారీగా 73.32 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు.

30 నెలల ప్రజాపాలనలో అన్నదాతలు ఎల్లప్పుడూ తలెత్తుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ కాదని, దానిని ఒక పండుగగా భావించేలా రాష్ట్రంలో అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే ఉందని గుర్తు చేశారు. 2023 నాటికి అది ఏకంగా రూ.8.11 లక్షల కోట్లకు చేరిందని.. గత 10 పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతు భరోసా నిధులు జమ అయితే వెంటనే రైతుల ఫోన్లకు ఎస్ఎంఎస్ రానుంది. రైతుల ఖాతాల్లో రేపు సాయంత్రం కల్లా నిధులు జమ కానున్నాయి.

Ryhtu Bharosa

ఒక వేళ మీకు మెసేజ్ రాకుంటే బ్యాంక్ వెళ్లి చెక్ చేసుకోవాలి. అయినా కూడా డబ్బులు జమ కాకుంటే వెంటనే మీ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. అలా కాకుండా మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే ఇతర యూపీఐ యాప్స్ వాడుతున్నా ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కాగా గత సంవత్సరం యాసంగి సీజన్ కు సంబంధించి ప్రభుత్వం కేవలం రెండేకరాల వరకే రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. మిగతా ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేయలేదు. దీంతో ఇప్పుడు కూడా 2 ఎకరాల వరకే రైతు భరోసా వేస్తారా అని బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.15 వేలు జమ చేయాలి. కానీ ఇప్పటికీ రూ. 12 వేలు ఇస్తూ.. అది కూడా సరిగా ఇవ్వడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కనీసం రైతు రుణా మాఫీ కూడా సరిగా చేయడం లేదని విమర్శిస్తున్నారు. కాగా రైతులకు సంబంధించి జూన్ 20న పీఎం కిసాన్ 23వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే ఏపీలో అన్నదాత సుఖీభవ మొదటి విడత అదే రోజు అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+