ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 732 పాయింట్ల నష్టపోయి 73,878 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
విప్రో, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, ఐటీసీ, టీసీఎస్, పవర్ గ్రిడ్, యాక్సెస్ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్ సీఎల్ టెక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, టైటాన్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, కోటక్ మహీంద్ర బ్యాంక్, జేఎస్ డబ్ల్యూ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, నెస్లే ఇండియా, రిలయన్స్, మారుతీ, ఎల్ అండ్ టీ నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీలో ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్ అత్యధికంగా నష్టపోయాయి. కోల్ ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జిసి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, హిందాల్కో ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. మెటల్ మినహా, అన్ని ఇతర రంగాల సూచీలు క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, టెలికాం, పిఎస్‌యు బ్యాంక్ ఒక్కొక్కటి 1 శాతం చొప్పున నష్టపోగా, ఆయిల్ & గ్యాస్, ఆటో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా ఒక్కొక్కటి 0.5 శాతం చొప్పున క్షీణించాయి.
సెషన్ ప్రారంభంలో తాజా గరిష్టాలను తాకిన తర్వాత విస్తృత సూచీలు కూడా ఒత్తిడికి గురయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పడిపోయాయి. బలహీనమైన యుఎస్ డాలర్, ముడి చమురు ధరల క్షీణతతో భారత రూపాయి శుక్రవారం 6 పైసలు లాభపడింది.


Click it and Unblock the Notifications