శుక్రవారం స్టాక్ మార్కెట్ లో బుల్ రంకలేసింది. మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1618 పాయింట్లు పెరిగి 76693 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 468 పాయింట్ల వృద్ధి చెంది 23290 వద్ద స్థిరపడింది. ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచడంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ఐటీ స్టాక్ ల్లో ర్యాలీ కనిపించింది. విప్రో 5 శాతానికి పైగా పెరిగ్గా.. టెక్ మహీంద్రా 4, ఇన్ఫోసిస్ 3 శాతం పెరిగాయి.
బీఎస్ఈ ఇండెక్స్ లో ఎంఅండ్ఎం, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్ టెల్, బజాబ్ ఫైనాన్స్, టాటా స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టైటాన్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, రిలయన్స్, హెచ్ సీఎల్ టెక్, ఎస్బీఐఎన్, టీసీఎస్, యాక్సెస్ బ్యాంక్, ఎల్అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, మారుతి, ఏసియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ లాభాల్లో ముగిశాయి.

అన్ని రంగాల సూచీలు ఆటో, ఐటీ, పవర్, టెలికాం, మెటల్ 2-3 శాతం వృద్ధితో గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం పెరిగింది. నిఫ్టీ 50లో ఎస్బీఐ లైఫ్, టాటా కన్సూమర్ నష్టపోగా.. మిగతా స్టాక్ లన్నీ లాభాల్లో ముగిశాయి. ముత్తూట్ మైక్రోఫిన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో వ్యూహాత్మక సహ రుణ భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలిపింది.
ఈ సహకారంతో ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ తన ఆర్థిక సేవలను భారతదేశంలోని గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాస్టెక్ తన icxPro ప్లాట్‌ఫారమ్‌ను ఎన్విడియా యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications