Stock Market Close: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఐటీ స్టాక్ ల్లో ఒత్తిడి..
శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 253 పాయింట్ల పెరిగి 73,917 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 62 పాయింట్ల వృద్ధి చెంది 22466 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, టాటా స్టీల్, టైటాన్, రిలయన్స్, ఎస్బీఐఎన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, యాక్సెస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, ఏసియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 138.60 పాయింట్లు పెరిగి 48,115.65 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.88% పెరిగి 51,604.90 వద్ద స్థిరపడింది.

మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ ధర శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 7% పైగా పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ బలమైన ఆదాయాలను నమోదు చేయడంతో త్రివేణి టర్బైన్ షేర్లు 8 శాతానికి పైగా పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.654.40కి చేరాయి.డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ గురువారం లాభాలను గడించాయి. $79/bbl పైన ముగిశాయి.


Click it and Unblock the Notifications