Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 46 పాయింట్లు పెరిగి 61,231 వద్ద ట్రేడవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్లు వృద్ధి చెంది 18,231 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 41,778 ట్రేడవుతుంది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.04శాతం పెరిగింది. BSE 30-షేర్ ఇండెక్స్ సెన్సెక్స్ మార్కెట్ బూమ్‌లో 119.14 పాయింట్ల లాభంతో 61,304.29 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్ 30
30 సెన్సెక్స్ స్టాక్‌లలో 20 స్టాక్ లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 50లో 32 స్టాక్‌లు పెరిగాయి. ఇండస్ఇండ్, హెచ్ సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, డా. రెడ్డీస్, ఐటీసీ, నెస్లే ఇండియా, కొటక్ మహీంద్రా, రియలన్స్, బజాజ్ ఫిన్సెర్వ్బ, ఎల్&టీ, హెచ్డీఎఫ్ సీబ్యాంకు, విప్రో, ఎం&ఎం, హెచ్డీఎఫ్ సీ, మారుతీ, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్, ఏసియన్ పెయింట్స్, ఎస్బీఐఎన్ లాభాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, జాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, టీసీఎస్, భారతీ ఎయిర్ టెల్, టైటాన్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications