Stock Market Opens: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 486 పాయింట్లు వృద్ధి చెంది 62,988 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 131 పాయింట్ల లాభపడి 18,630 వద్ద ట్రేడవుతోంది.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో బజాబ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టీసీఎస్, బజాబ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టైటాన్, టాటా మోటర్స్, ఎస్బీఐఎన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ సీఎల్, హిందుస్థాన్ యూనిలివర్, యాక్సిస్ బ్యాంక్, రియలన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కొటాక్ బ్యాంక్ టెక్ మహీంద్ర, ఎన్టీపీసీ, ఎల్&టీ, టాటా స్టీల్, ఐటీసీ, ఎం&ఎం, భారతీ ఎయిర్ టెల్, మారుతి, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ లాభాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ నష్టాల్లో ఉన్నాయి.

M&Mలో 3 శాతం, హెచ్‌డిఎఫ్‌సిలో 1.76 శాతం మరియు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో 1.66 శాతం కనిపిస్తున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 1.45 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1.39 శాతం పెరుగుదలను చూస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.01 శాతం లాభంతో ట్రేడవుతోంది.ఎం అండ్ ఎం స్టాక్ దాదాపు 5 శాతం పెరిగింది. రూ.62 రూపాయలు పెరిగి 1,344 వద్ద ట్రేడవుతోంది. మోతీలాల్ ఓస్వాల్ ఎంఅండ్ఎంకు టార్గెట్ ప్రైస్ రూ.1500 చేసింది. అమెరికా రుణ పరిమితి పెరిగే అవకాశం కనిపిస్తుండడంతో అమెరికా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతోన్నాయి.


Click it and Unblock the Notifications