సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 63 పాయింట్ల పెరిగి 65,345 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 24 పాయింట్లు వృద్ధి చెంది 19,355 వద్ద ముగిసింది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో రిలయన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటర్స్ లాభాల్లో ముగిశాయి.
ఏసియన్ పెయింట్స్, హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్ డిఎఫ్ సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఎల్అండ్ టీ, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, మారుతి, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, యాక్సిస్, హిందూస్థాన్ యూనిలివర్, విప్రో, టీసీఎస్, పవర్ గ్రిడ్, హెచ్ సీఎల్ టెక్, టైటాన్ నష్టాల్లో ముగిశాయి.

Cyient DLM షేర్లు సోమవారం దలాల్ స్ట్రీట్‌లో ప్రీమియంలో లిస్టయ్యాయి. Cyient DLM కంపెనీ ఒక్కో షేరు రూ. 403 వద్ద లిస్టయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో దాని ఇష్యూ ధర ఒక్కొక్కటి రూ. 265తో పోలిస్తే 52 శాతం ఎక్కువతో జాబితా అయింది. లిస్టింగ్‌కు ముందు Cyient DLM షేర్లు గ్రే మార్కెట్‌లో ఒక్కో షేరుకు రూ. 160-165 ప్రీమియమ్‌లో ట్రేడయ్యాయి. ఇది ఇష్యూ ధర రూ. 265 కంటే దాదాపు 60 శాతం ఎక్కువ.


Click it and Unblock the Notifications