అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పేటీఎం మాతృ సంస్థలో వాటాను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు మే 29న మీడియా నివేదికలు వచ్చాయి. దీని One97 కమ్యూనికేషన్స్ స్పందించింది. " కంపెనీ ఈ విషయంలో ఎటువంటి చర్చలలో పాల్గొనలేదని మేము దీని ద్వారా స్పష్టం చేస్తున్నాము. సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) నిబంధనల ప్రకారం మా బాధ్యతలకు అనుగుణంగా మేము ఎల్లప్పుడూ బహిర్గతం చేస్తూనే ఉంటాము" అని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.
మీడియా నివేదికపై అదానీ గ్రూప్ కూడా వివరణ ఇచ్చింది. ఈ నిరాధారమైన ఊహాగానాలను నిర్ద్వంద్వంగా ఖండించింది. ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. మే 29న ప్రారంభ ట్రేడింగ్‌లో Paytm షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మొబైల్ వాలెట్ పేటీఎంని నడుపుతున్న వన్ 97 కమ్యూనికేషన్స్‌లో వాటాపై ఆసక్తిగా ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మే 28న అదానీ గ్రూప్ చీఫ్‌ని అహ్మదాబాద్ ప్రధాన కార్యాలయంలో కలిశారని నివేదిక తెలిపింది.పోర్ట్స్-టు-ఎయిర్‌పోర్ట్‌ల సమ్మేళనం ఫిన్‌టెక్ మార్కెట్లోకి ప్రవేశిస్తే, ఇద్దరు మొదటి తరం వ్యవస్థాపకులు తమ ఒప్పందంలో విజయవంతమైతే.. అది గూగుల్ పే, వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే, ముఖేష్ అంబానీ జియో ఫైనాన్షియల్ వంటి కంపెనీలతో పోటీపడుతుందని భావిస్తున్నారు. కానీ ఎలాంటి ఒప్పంద జరగలేదని కంపెనీలు స్పష్టం చేశాయి.
శర్మకు వన్ 97లో దాదాపు 19 శాతం వాటా ఉంది. దీని విలువ మే 28న రూ. 342 ముగింపు ధర వద్ద రూ. 4,218 కోట్లు. శర్మ వ్యక్తిగతంగా పేటీఎంలో 9 శాతం, విదేశీ కంపెనీ రెసిలెంట్ అసెట్ మేనేజ్‌మెంట్ ద్వారా పరోక్షంగా 10 శాతం కలిగి ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లతో వన్ 97 దాఖలు చేసిన వివరాల ప్రకారం, శర్మ, రెసిలెంట్ ఇద్దరూ పబ్లిక్ వాటాదారులుగా ఉన్నారు.
జనవరి 31న, RBI నిబంధనలను పదేపదే ఉల్లంఘించడం, నియమాలను పాటించడం లేదని పేర్కొంటూ Paytm పేమెంట్స్ బ్యాంక్ (PPBL)పై వ్యాపార పరిమితులను విధించింది. ఫిబ్రవరి 29 తర్వాత తాజా డిపాజిట్లను స్వీకరించకుండా, క్రెడిట్ లావాదేవీలు చేయకుండా బ్యాంకింగ్ రెగ్యులేటర్ PPBLని నిషేధించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications