Rythu Bharosa: డిసెంబర్లో రైతు భరోసా.. బ్యాంకుల నుంచి రుణం తీసుకోనున్న ప్రభుత్వం..!
తెలంగాణలో యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి పలు అప్డేట్స్ వస్తున్నాయి. ఈసారి రైతు భరోసా ఎలా ఇవ్వాలి. సాగు చేసిన పంటలకే ఇవ్వాలా లేక వర్షాకాలంలో సాగు చేసిన భూములకు రైతు భరోసా ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. ఏది ఏమైనా రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులను అలర్ట్ చేశారు. రైతు భరోసా కోసం నిధులు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.48 కోట్ల ఎకరాలకు, 70.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,759 కోట్ల రైతు భరోసా జమ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కూడా ఇంతో మొత్తంలో రైతు భరోసా రైతులకు ఇవ్వనుంది. అయితే ప్రస్తుతం ఇంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు. దీంతో బ్యాంకుల నుంచి దాదాపు రూ.9 వేల కోట్ల అప్పు తీసుకురావాల్సి వస్తుందని ఆర్థిక అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకర్ల నుంచి లోన్ వస్తే అన్నదాత ఖాతాల్లో రైతు భరోసా జమ చేసే అవకాశం ఉందని సమాచారం. నవంబర్ చివరి కల్లా రుణాలు తీసుకురావాలని చూస్తున్నారు. యాసంగిలో రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. సాగు తగ్గినా వర్షకాలం సీజన్ ఎంత భూమికి రైతు భరోసా ఇచ్చామో అంతే భూమికి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.12 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. సీజన్ కు రూ.6 వేలు చొప్పున సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు అందిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అటు కేంద్రం రైతులకు పీఎం కిసాన్ పథకాన్ని అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications