Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్.. ఒకే విడతలో రైతు భరోసా నిధులు విడుదల..!

అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులు ఒకే విడతలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. రైతులకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. జూన్ 30న ఖమ్మం జిల్లాల మధిర నియోజకవర్గంలో భారీ బహిరంగ ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ కొత్త పాస్ బుక్ ల వివరాలను సీసీఎల్ఏ ద్వారా తెప్పించుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు రూ.9 వేల కోట్లను కేటాయించనున్నారు. అయితే సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో రోడ్లు, గుట్టలకు రైతు భరోసా ఇచ్చారని.. ఇప్పుడు సాగు భూములకు మాత్రమే భరోసా ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా యాసంగి సీజన్ కు సంబంధించి ప్రభుత్వం రైతుల రైతు భరోసా సరిగా ఇవ్వలేదు. కేవలం రెండెకరాలు వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.

Ryth Bharosa

దీంతో రైతులు ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ సీజన్ కు ఒకే విడతలో రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాకు సంబంధించి లిమిట్ ఉండాలని డిమాండ్ పెరుగుతోంది. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు నిధులు వద్దని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా లిమిట్ విధిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వచ్చే 7 ఎకరాల లోపు వారికే భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణలో 1.50 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి రియల్​ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములు, సాగుకు పనికిరాని పడావు ఉన్నయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ భూములను భరోసా నుంచి ఇప్పటికే తీసేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతలు లేవని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. యాసంగి 2 ఎకరాల వరకే రైతు భరోసా ఇచ్చారని గుర్తు చేసింది. ఇక రైతు రుణ మాఫీ సరిగా కాలేదని.. సగం మంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొంది. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమతున్నారని విమర్శించింది. కాగా కేంద్రం 23వ విడత పీఎం కిసాన్ నిధులు జూన్ 20న విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జూన్ 20న విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+