Gold: భారతీయుల ముందు చూపు.. అందుకే 34, 600 టన్నుల బంగారం కొనుగోలు..!

బంగారం అంటే.. ప్రతి ఒక్క భారతీయ మహిళకు ఇష్టమే. ఓ భార్య తనకు బంగారం కావాలని భర్తను అడుగుతుంది. ఓ కుమార్తె తనకు చెవి బంగారు చెవి కమ్మలు కావాలని తండ్రి అడుగుతుంది. ఇలా భారతీయ మహిళలకు బంగారం అంటే మక్కువ. చాలా మంది రూపాయి రూపాయి పొదుపు చేసి పసిడి కొనుగోలు చేసిన వారు చాలా మంది. కూలీ పని చేసేవారు కూడా అర తులమూ, పావు తులమూ కొనుగోలు చేస్తుంటారు. ప్రతి మహిళ తనకు బంగారం ఉండాలని కోరుకుంటుంది. అందుకే భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇది కొత్త విషయం ఏమి కాదు.. వందలాది ఏళ్లుగా భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో భారీ బంగారం కొనుగోలు చేస్తారు. అయితే ఇప్పటి వరకు భారతీయులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేశారని ఓ నివేదిక చెబుతోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 10 కేంద్ర బ్యాంకుల కంటే భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం ఎక్కువని తెలిస్తోంది. యూఎస్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్, భారత్, టర్కీ దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద రూ.26,500 టన్నుల బంగారం ఉంది. కానీ భారతీయుల వద్ద ఇంత కంటే ఎక్కువ పుత్తడి ఉంది. భారతీయ ఇళ్లలో 34, 600 టన్నుల బంగారం ఉంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలో ఇప్పటి వకు బయటకు తీసిన బంగారం.. భారత్ వద్దే 11 నుంచి 16 శాతం బంగారం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

Gold

భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ తెలిస్తే షాక్ అవుతాం. అవున భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం నిల్వల విలువ దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువే. అంటే ఇది భారత జీడీపీ కంటే ఎక్కువ. భారత జీడీపీ దాదాపు 4.1 ట్రిలియన్ డాలర్లు. ఇక మన వద్ద బంగారంలో సుమారు 67 శాతం ఆభరణాల రూపంలోనే ఉంది. చాలా దేశాల్లో పసిడిని పెట్టుబడిగా చూస్తారు. కానీ.. ఇండియాలో బంగారాన్ని స్టేటస్ గా చూస్తారు. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా చూస్తారు. బాబు లేదా పాప పుడితే బారసాలకు బంగారం పెడతారు. పుట్టిన రోజు చేస్తే బంగారం పెడతారు. ఆడ బిడ్డకు ఫంక్షన్ చేస్తే బంగారం పెడతారు. ఇక పెళ్లి చేస్తే మామూలుగా ఉండదు. అందుకే భారతీయల్లో బంగారం భాగమైందని చెబుతారు.

అలాగే చాలా మంది బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావిస్తారు. అత్యవసర సమయాల్లో పసిడి ఉపయోగపడుతుందని భావిస్తారు. అందుకే బ్యాంకుల్లో బంగారంపై రుణాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది డబ్బు ఉంటే బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. కాగా.. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. భారతీయుల వద్ద ఉన్న పసిడిపై చర్చ జరుగుతోంది. అయితే మన పూర్వికులు బంగారానికి ఎప్పటికైనా విలువ వస్తుందని.. అందుకే సంప్రదాయంలో బంగారాన్ని ఒక భాగం చేశారని చెబుతున్నారు. వారి ముందు చూపు వల్లే ఈ రోజు మన వద్ద ఇంత భారీ బంగారం ఉండడానికి కారణంగా చెబుతున్నారు. అటు భారతీయ సెంట్రల్ బ్యాంకు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2024 నుంచి ఆర్‌బీఐ దాదాపు 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడంతో ప్రభుత్వ నిల్వలు 880 టన్నులకు చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+