FFS: తెలంగాణలో అందుబాటులోకి కొత్త ఎరువుల బుకింగ్ యాప్.. ఎలా బుక్ చేసుకోవాలంటే..!
తెలంగాణలో ప్రస్తుతం ఫెర్టిలైజర్ యాప్ తో యూరియా బుకింగ్ జరుగుతోంది. అయితే తాజాగా పలు జిల్లాల్లో కొత్త ఎరువుల బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. అదే ఎఫ్ఎఫ్ఎస్. ఇందులో యూరియాతో పాటు మిగతా ఎరువులు కూడా బుక్ చేసుకోవచ్చు. యాప్స్ లో ఎరువులు బుక్ చేసుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొత్త యాపర్ రావడంతో మరింత గందరగోళానికి దారి తీస్తోంది. కొత్త యాప్ లో యూరియాతో పాటు డీఏపీ, పొటాష్, ఇతర కాంప్లెక్స్ ఎరువులు కూడా బుక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఫ్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సేల్(FFS) యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ఎరువులు బుక్ చేసుకోవచ్చు. ఇక నుంచి ఏ రకమైన ఎరువులు పొందాలన్నా ఈ యాప్ నుంచే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎరువులు కావాలంటే రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. లేకపోతే ఆధార్ ఆధారంగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతే అవసరమున్న అన్ని రకాల ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత రైతు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఆధార్ నంబర్ కు లింక్ ఉన్న ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. అందులో రైతు పేరు ఉంటుంది. ఆ రైతు ఎన్నికల భూమి ఉందో చూపిస్తుంది. ఆ భూమిని సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు వేసిన పంటను ఎంచుకోవాలి. వరి వేసినట్లు అయితే మీకు Rice(వరి) చూపిస్తుంది. దాన్ని సెలక్ట చేయాలి. తర్వాత మీకు యూపీయా, డీఏపీ, 20-20 ఎరువులు కనిపిస్తాయి. మీకు యూరియా కావాలంటే దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యూరియాలో రెండు రకాలు ఉంటాయి.
అందులో ఒకటి 40 కిలోల బస్తా, మరొక్కటి 45 కిలోల బస్తా ఉంటుంది. మీకు కావాల్సిన బస్తాను సెలక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎకరానికి 2 యూరియా బస్తాలు మాత్రమే వస్తాయి. ఈ యాప్ లో జిల్లావారీగా చూపిస్తుంది. ఫెర్టిలైజర్ యాప్ లో మండలాలవారికి చూపిస్తే ఫ్రేమ్‌వర్క్ ఫర్టిలైజర్ సేల్ లో జిల్లావారీగా చూపిస్తుంది. షాప్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి . తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యూరియా బుక్ అయిపోతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications