మీ పని కూడా AI చేతుల్లో కెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది

మన జీవితంలో టెక్నాలజీ ఒక భాగం అయిపోయింది. పనులు వేగంగా చేయడం, సమాచారం త్వరగా పొందడం, చక్కగా మేనేజ్ చేయడం ఇవన్నీ ఇప్పుడు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్లే సాధ్యమవుతున్నాయి. కానీ ఈ టెక్నాలజీ మన ఉద్యోగాల్ని కూడా తీసేస్తుందనే భయం ఇప్పుడు పెరుగుతోంది.

Artificial Intelligence future Mo Gawdat prediction AI and job loss AGI threat AI impact on society AI AGI AI

ఈ నేపథ్యంలో, గూగుల్ X సంస్థలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన మో గవ్డాట్ (Mo Gawdat) ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముందు 15 సంవత్సరాలు మనం చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఆ తర్వాతే మంచి పరిస్థితులు వస్తాయి అని అన్నారు. ఇది ఎందుకు అనడిగితే AI వల్ల లక్షల ఉద్యోగాలు పోతాయని, ఇది సామాన్య మనుషులకి తలనొప్పిగా మారుతుందని ఆయన అభిప్రాయం.

మో గవ్డాట్ ప్రస్తుతం ఓ AI స్టార్టప్ నడుపుతున్నారు. ఇది కొన్ని సంవత్సరాల క్రితం అయితే, 300 మంది డెవలపర్లు కావాల్సింది. ఇప్పుడు మాత్రం మేము ముగ్గురే అంతా చేస్తున్నాం," అని అన్నారు. ఒకప్పుడు పెద్ద కంపెనీలు చేయాల్సిన పనులు, ఇప్పుడు చిన్న టీమ్‌తో AI సహాయంతో జరగిపోతున్నాయి. ఇది ఉద్యోగ అవకాశాలను తగ్గించే ఒక ఉదాహరణ మాత్రమే.

డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ లాంటి ఉద్యోగాలే ప్రమాదంలో ఉన్నాయని. కానీ గవ్డాట్ చెబుతున్నది అంతకంటే తీవ్రమైన. AI CEO స్థాయిలో కూడా పనులు చేయగలదు. ఇది మన కంటే మెరుగ్గా నిర్ణయాలు తీసుకోగలదు అని ఆయన అన్నారు.

గవ్డాట్ మాట్లాడుతు ఉద్యోగాలు పోతే ఒంటరితనం, బాధలు, డిప్రెషన్ మాత్రం పెరుగుతాయి. ఈ కారణంగా కొందరు ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు.

AI రంగంలో ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ కూడా ఒక పెద్ద హెచ్చరిక చేశారు. AI ఒక రోజు వాళ్లకే అర్థమయ్యే భాషలో మాట్లాడటం ప్రారంభించవచ్చు. అప్పుడు మనం వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారో గ్రహించలేము. ఆ పరిస్థితిలో వాళ్లను నియంత్రించడం కూడా చాలా కష్టం అవుతుంది" అని ఆయన చెప్పారు. ఈ మాటలు వింతగా అనిపించినా, శాస్త్రీయంగా ఇదే జరుగుతున్నదన్న స్పష్టత ఉంది.

AI ఎదుగుదల ఆపలేం. కానీ దాని ప్రభావాన్ని తక్కువ చేయాలంటే మన విద్యా విధానం మారాలి. కొత్త రంగాల్లో మానవ విలువలపై దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరూ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఇది భయం పుట్టించడానికే కాదు. మనలో చైతన్యం కలిగించడానికే అని గవ్డాట్ పేర్కొన్నారు.

AI వల్ల కొంత మేలు జరుగుతుంది. కానీ అది మనను నియంత్రించే స్థాయికి వస్తే, మనకు భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుంది. మో గవ్డాట్ లాంటి టెక్నాలజీ నిపుణుల హెచ్చరికలు మనం సీరియస్‌గా తీసుకోవాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+