EPFO: ఉద్యోగులు గుడ్ న్యూస్.. ఇక నుంచి 3 రోజుల్లోనే పీఎఫ్ విత్ డ్రా డబ్బులు జమ..!
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. న ప్రావిడెంట్ ఫండ్ (PF) విత్‌డ్రాయల్ క్లెయిమ్‌లను మూడు రోజుల్లో పరిష్కరించే లక్ష్యంతో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవలి తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది ఒకటి. గతంలో పీఎఫ్ విత్ డ్రా రిక్వెస్ట్ పెడితే వారం నుంచి రెండు వారాలు పట్టేది. ఇప్పుడు ఆ సమయాన్ని గణనీయంగా తగ్గించడం చందాదారులకు ఊరట కల్పించే అంశంగా చెప్పుకోవచ్చు. విత్ డ్రా ప్రక్రియ సులభతరం చేయడానికి ఆటోమేషన్ ను ఉపయోగిస్తున్నారు. నూతన నిబంధన ప్రకారం అర్హత కలిగిన PF విత్‌డ్రాయల్ క్లెయిమ్‌లను మూడు రోజుల్లో పరిష్కరించాలి.
గతంలో మాన్యువల్ వెరిఫికేషన్, విధానపరమైన జాప్యాల కారణంగా చందాదారులు తరచుగా ఇబ్బందులు ఎదుర్కునేవారు. సకాలంలో ప్రాసెసింగ్ జరిగేలా చూసేందుకు 20 రోజులకు మించి ఆలస్యం చేయకుండా నిబంధన విధించారు. ఒక వేల 20 రోజుల కంటే ఎక్కువ ఆలస్యమైతే బాధ్యులైన అధికారులు 12 శాతం జరిమానా వడ్డీని చందాదారులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని సదరు ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తారు. జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, నిర్దేశించిన కాలపరిమితిలోగా క్లెయిమ్‌లు ప్రాసెస్ అయ్యేలా చూడటం ఈ నిబంధన లక్ష్యమని కార్మిక శాఖ ప్రకటించింది.

పూర్తి కేవైసీ వివరాలు ఉన్న క్లెయిమ్‌లకు మూడు రోజుల సెటిల్‌మెంట్ కాలపరిమితి వర్తిస్తుందని తెలుస్తోంది. అయితే అదనపు ధృవీకరణ అవసరమయ్యే కేసులకు ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈపీఎఫ్ఓ సంస్థ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. మాన్యువల్ నుంచి డిజిటల్ గా మార్చింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆటో-సెటిల్‌మెంట్ ను ప్రవేశపెట్టింది. దీనివల్ల మానవ పరిశీలన లేకుండానే మరిన్ని అర్హతగల క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గతంలో ఈపీఎఫ్ఓ ఆటో-సెటిల్‌మెంట్ పరిమితి రూ.1 లక్ష మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని రూ. 5 లక్షలకు పెంచింది.
మీరు విత్ డ్రా చేసుకున్న సొమ్ము త్వరగా మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని పని చేయాల్సి ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివ్‌గా ఉంచుకోవాలి. ఆధార్‌ను UANతో అనుసంధానించాలి. PAN, బ్యాంకు ఖాతా వివరాలు అప్‌డేట్ చేసి ఉండాలి. KYC పూర్తి చేసి ఉండాలి.OTP కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. ఇవన్నీ పూర్తి చేస్తే మూడు రోజుల్లోనే మీ విత్ డ్రా సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కాగా ఈపీఎఫ్ఓ సంస్థ UPI ద్వారా ఆపరేట్ చేసే అవకాశం కల్పించనున్నారు.


Click it and Unblock the Notifications