ఫోర్బ్స్ ప్రకారం 2008లో అనిల్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఆరో వ్యక్తి. అప్పుడు ఈ కుబేరుడి వద్ద ఉన్న సంపదన 42 బిలియన్ డాలర్లు. కాలం గిర్రున తిరిగి 12 ఏళ్లు గడిచింది. ఇప్పుడు అనిల్ అంబానీ వద్ద ఉన్న ఆస్తి జీరో. డిసెంబర్ 31, 2019 నాటికి టెలికం, నావల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ బిజినెస్ డిఫాల్ట్‌లు రూ.43,800 కోట్లు. పుష్కర కాలంలో ప్రపంచంలోని టాప్ కుబేరుల్లో ఒకరైన అనిల్ వద్ద ఇప్పుడు ఏమీ లేవు. తన వద్ద ఆస్తి ఏమీ లేదని లండన్ కోర్టులో స్పష్టం చేశారు.

అనిల్ అంబానీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంతంటే?
అనిల్ అంబానీకి చెందిన అన్ని వ్యాపారాలు కూడా అప్పుల్లో కూరుకుపోయాయి. కొన్ని బ్యాంక్రప్టసీలో ఇరుక్కుపోయాయి. జూన్ 2019 నాటికి అనిల్ అంబానీకి చెందిన ఆరు గ్రూప్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,196 కోట్లు. ఫిబ్రవరి 10, 2020 నాటికి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,645.65గా ఉంది.

చుట్టుముట్టిన కేసులు
ఒకప్పటి కుబేరుడు అనిల్ అంబానీ ప్రస్తుతం మూడు చైనీస్ కంపెనీల నుండి లాసూట్ ఎదుర్కొంటున్నారు. 680 మిలియన్ డాలర్ల రికవరీకి ఇవి లాసూట్ వేశాయి. తాజాగా ఆరు వారాల్లో 100 మిలియన్ డాలర్లు డిపాజిట్ చేయాలని లండన్ కోర్టు ఆదేశించింది. కానీ తన వద్ద ఒక్క రూపాయి లేదని అనిల్ అంబానీ కోర్టుకు విన్నవించారు. తన పెట్టుబడుల వ్యాల్యూ కుప్పకూలిందని, తన వద్ద ఉన్న ఆస్తి జీరో అని పేర్కొన్నారు. నా వద్ద చెప్పుకోదగ్గ లేదా విక్రయించి సొమ్ము చేసుకోగలగల ఆస్తుల్లేవన్నారు.

కలిసి ఉన్నప్పుడు రూ.28,000 కోట్ల నెట్ వర్త్
ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ. వీరి తండ్రి ధీరూబాయ్ అంబానీ 2002లో మృతి చెందారు. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ముఖేష్ చైర్మన్‌గా, అనిల్ అంబానీ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. నాడు నెట్ వర్త్ రూ.28,000 కోట్లు.

విడిపోయి.. తొలుత పోటీ లేకుండా..
2005 నుండి అన్నదమ్ములు ముఖేష్, అనిల్ మధ్య విభేదాల పొడసూపాయి. ఆ తర్వాత కంపెనీ రెండుగా విడిపోయింది. టెలికం, పవర్ జనరేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌లను అనిల అంబానీ తీసుకున్నారు. ఆయిల్ రిఫైనరింగ్, పెట్రో కెమికల్స్ బిజినెస్‌ను ముఖేష్ తీసుకున్నారు. నాన్-కంపీట్ ప్యాక్ట్‌ను 2010పై సంతకం చేసుకున్నారు. అంటే అప్పటి వరకు ఒకరికొకరు పోటీగా ఉండకూడదు.

అనిల్ అంబానీ చేతిలో...
రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ నావల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లను అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నిర్వహించింది. అప్పుడే ఎదుగుతున్న, మంచి స్కోప్ ఉన్న టెలికం బిజినెస్‌ను అనిల్ అంబానీ కోరి మరీ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ముఖేష్ క్రమంగా ఆసియా కుబేరుడి స్థాయికి ఎదిగారు. అనిల్ మాత్రం అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితికి వెళ్లిపోయారు.

రుణాలు చెల్లించాలని..
ఒకప్పుడు దేశంలోనే కుబేరుడు, ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ కొద్ది కాలంగా వ్యాపారంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. అనిల్‌కు చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 92.5 కోట్ల డాలర్ల రుణాన్ని తీసుకుంది. తీవ్ర నష్టాలతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా తీసింది. దీంతో చైనా బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు తమకు రావాల్సిన 4,800 కోట్లు చెల్లించాలని కోర్టుకు వెళ్లాయి.

ఆయన ఆస్తులు జీరో.. కోర్టుకు తెలిపిన లాయర్
రుణ ఒప్పందం కింద రూ.4,800 కోట్లు చెల్లించాలని బ్యాంకులు కోర్టులో దావా వేశాయి. వాదనలు విన్న జడ్జి రూ.700 కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే అనిల్ చెల్లించాల్సిన అప్పులను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఆయన ఆస్తులు వ్యాల్యూ పూర్తిగా పడిపోయిందని, అనిల్ తరఫు న్యాయవాది రాబర్డ్ హోవే కోర్టుకు విన్నవించారు.

జైలుకు వెళ్లకుండా కాపాడిన అన్న ముఖేష్
గతంలో అనిల్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు అన్న ముఖేష్ అంబానీ తమ్ముడిని కాపాడారు. స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు R.Com చెల్లించాల్సిన రూ.462 కోట్ల మొత్తాన్ని ముఖేష్ చెల్లించి, తమ్ముడు జైలుకు వెళ్లకుండా కాపాడారు.

అన్నను మించిన తమ్ముడు
2007లో ఇద్దరు సోదరుల మధ్య ఆస్తుల వ్యాల్యూలో వ్యత్యాసం స్వల్పంగా ఉంది. ఫోర్ట్స్ 2007 ధనవంతుల జాబితాలో అనిల్ అంబానీ సంపద 45 బిలియన్ డాలర్లు. ముకేశ్ అంబానీ సంపద విలువ 49 బిలియన్ డాలర్లు. 2006లో అన్నను కూడా మించి పోయారు. దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరుగా నిలిచారు.

90 శాతం సంపద హరించుకుపోయింది
2008లో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచిన అనిల్ పన్నెండేళ్ల తర్వాత అందుకు భిన్నంగా ఉంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ నెట్ వర్త్ ప్రకారం 2019లో అనిల్ సంపద 1.9 బిలియన్ డాలర్లు. అంటే రూ.13,100 కోట్లు మాత్రమే. 2007తో పోలిస్తే ఏకంగా 90 శాతం సంపద హరించుకుపోయింది. ముఖేష్ అంబానీ సంపద 2007తో పోలిస్తే 2019 నాటికి 10 శాతం పెరిగింది. అనిల్ గత ఏడాది బిలియనీర్ల జాబితాలో చోటు కోల్పోయారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications