న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ కంపెనీ పెప్సికో ఇంక్ ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ లేస్ పొటాటో చిప్‌ల కోసం ప్రత్యేకంగా పండించిన బంగాళాదుంప రకానికి సంబంధించిన పేటెంట్‌ను రద్దు చేసిన ఆర్డర్‌పై పెప్సికో ఇంక్ చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
మొక్కల రకాలు, రైతుల హక్కుల పరిరక్షణ (PPVFR) అథారిటీ 2021లో పెప్సికో FC5 బంగాళాదుంప రకానికి మంజూరు చేసిన మేధో రక్షణను ఉపసంహరించుకుంది. భారతదేశ నియమాలు విత్తన రకాలపై పేటెంట్‌ను అనుమతించడం లేదని పేర్కొంది.
విత్తన రకంపై కంపెనీ పేటెంట్‌ను క్లెయిమ్ చేయలేమని రైతుల హక్కుల కార్యకర్త కవిత కురుగంటి వాదించడంతో పెప్సికో పేటెంట్ కవర్‌ను అథారిటీ తొలగించింది. పేటెంట్ కవర్ రద్దుపై పెప్సికో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అధికారిక నిర్ణయంపై పెప్సికో చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా జులై 5 నాటి ఉత్తర్వులో తోసిపుచ్చారు. "మాకు ఆర్డర్ గురించి తెలుసు .. దానిని సమీక్షించే ప్రక్రియలో ఉన్నాము" అని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

1989లో భారతదేశంలో మొట్టమొదటి పొటాటో చిప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన U.S. స్నాక్స్, డ్రింక్స్ తయారీదారు పెప్పికో.. FC5 సీడ్ రకాన్ని రైతులకు సరఫరా చేసింది. దీనికి ప్రతిగా వారు తమ ఉత్పత్తులను కంపెనీకి స్థిర ధరకు కంపెనీకి విక్రయిస్తారు. పెప్సికో FC5 రకాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందని కంపెనీ పేర్కొంది. FC5 రకం బంగాళాదుంప చిప్స్ వంటి స్నాక్స్ చేయడానికి అవసరమైన తేమను తక్కువగా కలిగి ఉంటుందని చెప్పింది.
2019లో పెప్సికో కొంతమంది భారతీయ రైతులపై FC5 బంగాళాదుంప రకాన్ని సాగు చేసినందుకు దావా వేసింది. సాగుదారులు దాని పేటెంట్‌ను ఉల్లంఘించారని ఆరోపించింది. పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు కంపెనీ ఒక్కొక్కరి నుంచి 10 మిలియన్ రూపాయల కంటే ఎక్కువ ($121,050) పరిహారాన్ని డిమాండ్ చేసింది. నెలరోజుల్లోనే పెప్సికో రైతులపై దావాలను ఉపసంహరించుకుంది. పెప్సికో భారతదేశంలో పేటెంట్ ఉల్లంఘన సమస్యలను ఎదుర్కొంటున్న రెండవ అతిపెద్ద కంపెనీగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications