పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఈకేవైసీ గడువు కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆగస్టు 31 తేదీ ఈకేవైసీకి చివరి తేదీ కాగా.. గురువారం గడువును మరోసారి పెంచింది. ఇప్పటికైనా ఈకేవైసీ చేయించుకోని రైతులు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కోరింది. రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చారు.

2019
2019లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తోన్నారు. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమా చేస్తున్నారు. ఇప్పటికే 11వ విడత డబ్బులు విడుదల చేయగా.. త్వరలో 12వ విడత డబ్బులు రానున్నాయి. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే డబ్బులు ఖాతాలో జమా అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

వారు అనార్హులు
ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. వీరికి భూమి ఉన్నా పీఎం కిసాన్ డబ్బులు రావు. అలాగే ఒకే రేషన్ కార్డులో ఉన్న ఇద్దరి పేరుపై భూమి ఉంటే ఈ పథకాని ఒక్కరే అర్హులు అవుతారు. అయితే ఈకేవైసీ కోసం ఇప్పటికే గడువును పలుసార్లు పొడిగించారు.
ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే..
1.ముందుగా PMkisan.gov.in వెబ్‌సైట్ వెళ్లాలి.
2.అందులో ఫార్మర్ కార్నర్ ఉంటుంది.
3. ఫార్మర్ కార్నర్ లో మొదటి ఆప్షన్ eKYC ఉంటుంది.
4. eKYC పై క్లిక్ చేయాలి.
5.అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది
6.ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి
7.ఆ తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
8. మీ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఏటీపీ ఎంటర్ చేస్తే eKYC ప్రక్రియ పూర్తి అవుతుంది.

మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే..
eKYC ప్రక్రియ పూర్తి చేయాలంటే తప్పుకుండా ఫోన్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఆధార్ లింక్ లేకుంటే మీ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్ కు వెళ్లి ఆధార్ తో ఫోన్ నెంబర్ లింక్ చేయాలి. ఇందుకోసం వారు నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు.


Click it and Unblock the Notifications