న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ శుభవార్త వినిపించింది. 22 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులతో ముడిపడి ఉన్న కీలక సమాచారాన్ని అందజేసింది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రకటనను వెలువడించింది. ట్యాక్స్ పేయర్లకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఆదాయపు పన్నుల శాఖ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ట్వీట్ చేసింది.

22 లక్షల మందికి పైగా బెనిఫిట్..
సీబీడీటీ చేసిన ఈ ప్రకటన వల్ల 22 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి అంటే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేసిన పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయని వారిపై ఈ రకంగా పెనాల్టీ విధించింది.

ఆలస్య రుసుముగా వేల కోట్లు..
ఆలస్య రుసుమును వసూలు చేసింది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో చోటు చేసుకున్న సాంకేతిక లోపం, తప్పిదాలే దీనికి కారణమని ఆ తరువాత గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. సాంకేతిక లోపం వల్ల ఈ పరిణామం తలెత్తిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల జాప్యం లేదని గుర్తించింది. ఈ క్రమంలో ట్యాక్స్ పేయర్ల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లిస్తామని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లో భాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.

కార్పొరేట్ ట్యాక్స్ వాటా అధికం..
అదనపు వడ్డీ, ఆలస్య రుసుముల రూపంలో ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు ఈ అయిదు నెలల కాలంలోనే రాబట్టిన మొత్తం విలువ 47,318 కోట్ల రూపాయలు. ఇందులో కార్పొరేట్ ట్యాక్సుల వాటా అధికం. కార్పొరేట్ ట్యాక్సుల రూపంలో 33,078 కోట్ల రూపాయల మొత్తాన్ని అధిక వడ్డీ, ఆలస్య రుసుముగా వసూలు చేసింది. 1,22,511 కార్పొరేట్ కేసులు ఉన్నాయి. మిగిలిన 14,241 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇండివిడ్యువల్స్ నుంచి వసూలు చేసింది. ఇలాంటి 21,38,375 మంది ఉన్నారు. మొత్తం 22.61 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసింది.

గడువు కూడా పొడిగింపు..
అలాగే- పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడానికి లేటెస్ట్ వెర్షన్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. పొరపాటు తమవైపే ఉండటం వల్ల ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును కూడా పొడిగింది. ఇక ట్యాక్స్ పేయర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా తమ ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి వెసలుబాటును కల్పించింది. ఇదివరకు ఈ గడువు జూలై 31వ తేదీ వరకే ఉండేది.
బిగ్ రిలీఫ్..
గడువు పొడిగించినా కూడా అంటే జూలై 31 తరువాత కూడా ఐటీ రిటర్నులను దాఖలు చేసిన వారిపైనా అంటే ఈ నెల 9వ తేదీ వరకు కూడా పన్ను చెల్లింపుదారుల నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆలస్య రుసుము లేదా వడ్డీని వసూలు చేసింది. ఈ డబ్బులను మళ్లీ వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం లక్షలాది మందికి బిగ్ రిలీఫ్ కలిగించినట్టయింది. వారు కట్టిన సొమ్ము మళ్లీ వెనక్కి రానుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications