PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో బ్యాంకు ఖాతాల్లోకి రూ.6 వేలు..!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కేంద్రం నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. వచ్చే వారం రైతులు ఖాతాల్లో పీఎం కిసాన్ 24వ విడత జమ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 23 విడతలుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రూ.46 వేల జమ అయ్యాయి. 23వ నిధులు గత జూన్ లో రైతులు ఖాతాల్లో జమ చేశారు. నాలుగు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఈ నెలలో పీఎం కిసాన్ 24 విడత విడుదల చేస్తారని ప్రచారం సాగుతుంది.
ముందుగా అక్టోబర్ 17 లేదా 18 తేదీల్లో పీఎం కిసాన్ 24వ విడత విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పీఎం కిసాన్ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నాయి. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20 అందిస్తోంది. ఇందులో కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ రూ.6 వేలు పోగా.. ఏపీ ప్రభుత్వం రూ.14 వేలు చెలిస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ 24వ రూ.2 వేలు ఇస్తుండగా.. అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు ఇవ్వనున్నారు. మొత్తం రూ.6 వేలు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

పీఎం కిసాన్ నిధులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుంటే.. వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. కాగా పీఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ పథకం తీసుకొచ్చినప్పటి నుంచి కేవలం రూ.6 వేలే ఇస్తున్నారు. ప్రస్తుతం ఎరువులు, కూలీలు, విత్తనాల ధరలు పెరిగాయని.. అందుకే రూ.6 వేలను రూ.12 వేలకు పెంచాలని రైతులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత కేంద్ర బడ్జెట్ సందర్భంగా పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6 వేలను రూ.9 వేలకు పెంచుతారని ప్రచారం జరిగింది. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఏపీలో అన్నదాత సుఖీభవ అందిస్తుండగా.. తెలంగాణ రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు సీజన్ కు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.12 వేలు అందిస్తున్నారు. వర్షాకాలం సీజన్ కు సంబంధించి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. యాసంగి సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఒక ఎకర తీసుకుంటే తెలంగాణలో రైతు భరోసా రూ.12 వేలు, పీఎం కిసాన్ రూ.6 వేలు మొత్తం రూ.18 వేలు వస్తాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications