రైతులకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 13 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయింది. అన్నదాతలు ఇప్పుడు 14వ విడత పీఎం కిసాన్ నిధి నిధుల కోసం వేచి చూస్తున్నారు. పలు నివేదికల ప్రకారం జూన్ చివరి వారంలో 14వ విడత డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
కొన్ని మీడియా నివేదికల ప్రకారం, 14వ విడత శుక్రవారం, జూన్ 23, 2023 నాడు రైతుల జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి నిధులు పొందాలనకుంటే దరఖాస్తు చేసుకోవాలి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లండి . ఇక్కడ కొత్త రైతు నమోదుపై క్లిక్ చేయండి. ఆపై దరఖాస్తు చేయడానికి భాషను ఎంచుకోండి. మీరు పట్టణ ప్రాంత రైతు అయితే, అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. అన్ని వివరాలు నమోదు చేయాలి.

తర్వాత గెట్ OTPకి వెళ్లి సబ్మిట్ చేయండి. అప్పుడు మీరు అందులో నమోదు పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. అయితే ఈ పథకానికి ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ కేవైసీ చేసుకున్న వారికే డబ్బులు జమ చేస్తోంది. అయితే ఇప్పటికీ కొంత మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు. వారు వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
eKYC ఎలా చేసుకోవాలంటే..
ముందుగా https://pmkisan.gov.in/ లోకి వెళ్లారు. అక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నంబర్, క్యాప్చ అడుగుతుంది. ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అప్పుడు మీ ఆధార్ లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చేస్తే మీ ఈకేవైసీ పూర్తి అయినట్లే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications