ప్రధాని నరేంద్ర మోడీ ఉద్యోగాల కల్పన ఆశలు సాకారమవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు. భారత్‌లో ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలోని టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలలో వేలాదిమంది మహిళా కార్మికులు.. టామీ హిల్‌ఫైగర్, కోల్స్ కార్ప్ అమెరికా కస్టమర్ల కోసం నూలును, ఫ్యాబ్రిక్‌ను టీ-షర్ట్స్, షర్ట్స్, స్పాగెట్టీ టాప్స్, పిల్లల దుస్తులుగా మార్చడంలో బిజీగా ఉన్నారట.
ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌ను అధిగమించుతున్నాయి. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుండి భారత వస్త్ర పరిశ్రమ కోలుకుంటోంది. 2024లో మూడోసారి ఓటర్ల ముందుకు వెళ్తున్న మోడీకి, అధికార బీజేపీకి టెక్స్‌టైల్ మార్కెట్ ప్రకాశవంతంగా కనిపించడం సానుకూల పరిణామం.

వస్త్ర పరిశ్రమ పుంజుకుంటోంది
వస్త్ర పరిశ్రమ వ్యాపారం పుంజుకుంటోందని, అమెరికన్ కంపెనీల దుస్తుల తయారీతో తాము బిజీగా ఉన్నామని, ప్రస్తుతం ఉన్న వర్క్ ఫోర్స్‌కు అదనంగా మరింతమందిని తీసుకుంటామని ఓ టెక్స్‌పోర్ట్ ఫ్యాక్టరీ అధినేత చెబుతున్నారు. అంతేకాదు, టెక్ హబ్ బెంగళూరుకు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హిందూపురంలోని ఈ కంపెనీ తన ప్రధాన ఉత్పత్తి స్థావరం చుట్టూ కొత్త విభాగాలను నిర్మించేందుకు భూమి కోసం కూడా వెదుకుతోంది.

మోడీ విజయం సాధించాలంటే
నిరుద్యోగాన్ని కట్టడి చేయడంలో మోడీ విజయం సాధించాలంటే దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉద్యోగ అవకాశాలు కలిగిన టెక్స్‌టైల్, దుస్తులు పరిశ్రమ సానుకూలంగా ఉండాలని చెబుతున్నారు. ప్రస్తుతం భారత నిరుద్యోగిత రేటు 7 శాతానికి పైగా ఉంది. గత ఆరేళ్లలో ప్రపంచ సగటు ఐదు శాతాన్ని మించింది. ప్రతి ఏడాది లక్షలాది మంది లేబర్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగం ప్రధాన సమస్య. నిరుద్యోగ సమస్య తగ్గడానికి టెక్స్‌టైల్ పరిశ్రమ పైన కూడా మోడీ ప్రభుత్వం దృష్టి సారించాలని చెబుతున్నారు.

అప్పుడే బంగ్లాదేశ్‌ను అధిగమిస్తాం
ప్రపంచంలో అయిదో అతిపెద్ద టెక్స్‌టైల్, దుస్తుల ఎగుమతిదారు భారత్. ప్రపంచ మార్కెట్‌లో భారత్ వాటా 840 బిలియన్ డాలర్లతో నాలుగు శాతంగా ఉంది. చైనా మాత్రం మూడొంతుల వాటాతో ఉంది. దశాబ్ద కాలం క్రితం భారత్ ఎగుమతులు బంగ్లాదేశ్‌తో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నాయి. కానీ ఇటీవల కాస్త వెనుకబడింది.
ఇందుకు ప్రధాన కారణం అధిక లేబర్ ఖర్చుల కారణంగా దుస్తులు 20 శాతం ఖరీదుగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు భారత్‌లో క్రమంగా ఉత్పత్తి పెరుగుతోంది. దుస్తులకు కావాల్సిన పత్తి నుండి ప్రతి దానికి సరఫరా గొలుసు భారత్‌లో ఉంది. అయితే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేస్తేనే బంగ్లాదేశ్‌ను అధిగమించగలమని అంటున్నారు.

ఎగుమతులు..
టెక్స్‌పోర్ట్, వెల్స్పన్ ఇండియా, రేమాండ్స్ వంటి భారతీయ కంపెనీల కొనుగోలుదారులు అమెజాన్, టార్గెట్, కాస్ట్‌కో, వాల్‌మార్ట్ ఇంక్, టెస్కో, మెసీ వంటివి ఉన్నాయి. ఈ అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో టెక్స్ టైల్ అండ్ అప్పారెల్ ఎగుమతులు 52 శాతం పెరిగి 30.5 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
ప్రభుత్వం పూర్తి సంవత్సరానికి గాను 44 బిలియన్ డాలర్ల వ్యాల్యూ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. 2015-2019 మధ్య అంతర్జాతీయ టెక్స్ టైల్ ఎగుమతులు 2 శాతం పెరగగా, భారత్ నుండి మాత్రం 0.8 శాతం తగ్గాయి. బంగ్లాదేశ్, వియత్నాం నుండి పది శాతం చొప్పున పెరిగాయి. అయితే భారత్‌లో ఇటీవల పుంజుకొని, ఉత్పత్తి పెరగడంతో పాటు ఉద్యోగాలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications