Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. మస్క్ ఇండియాకు వచ్చి శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలవాల్సి ఉంది. మస్క్ దేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు ప్రణాళికను కూడా ప్రకటించాలని భావించారు. అయితే బిలియనీర్ తన పర్యటనను వాయిదా వేయడంతో అంతా నిరాశ చెందారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో మస్క్ భార్త లో పర్యటించాలి.
అయితే మస్క్ అనూహ్యంగా తన పర్యట వాయిదా వేసుకున్నారు. "దురదృష్టవశాత్తూ టెస్లా బాధ్యతల కారణంగా భారతదేశ సందర్శన ఆలస్యం అవుతోంది. కానీ ఈ సంవత్సరం చివర్లో సందర్శించడానికి నేను చాలా ఎదురు చూస్తున్నాను." మస్క్ ఎక్స్ లో రాకుకొచ్చారు. మస్క్ ట్వీట్ ను బట్టి ఆయన ఈ ఏడాది డిసెంబర్ లో భారత్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మస్క్ భారత పర్యటనకు వస్తే తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించాలని భావించారు.

దీని కోసం చాలా సంవత్సరాలుగా గ్రౌండ్‌వర్క్ జరుగుతోంది. టెస్లా ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ఒక కర్మాగారాన్ని నెలకొల్పుతున్నందున ఈ ప్రాజెక్ట్ కనీసం $2-3 బిలియన్ల పెట్టుబడిని పెట్టే అవకాశం ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. న్యూఢిల్లీలోని పలు స్పేస్ స్టార్టప్‌ల ఎగ్జిక్యూటివ్‌లను కూడా ఆయన కలిసేవారు. పర్యటన వాయిదాతో ఇవన్నీ రద్దయ్యాయి.
మస్క్ భారతదేశంలో తన స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం ప్రారంభించడానికి మస్క్ ప్రభుత్వ నియంత్రణ ఆమోదాల కోసం ఎదురుచూస్తున్నాడు. అంతకుముందు మస్క్ తన పర్యటన గురించి ఎక్స్ ట్వీట్ చేశారు. తను పీఎం మోడీతో సమావేశం కానున్నట్లు ధృవీకరించారు.


Click it and Unblock the Notifications