అవును. ఇప్పుడు భారత దేశం పఠించాల్సిన మంత్రం ఆకర్షణే. ఎందుకంటే చైనా ఒక విషయంలో విజయం సాధించి ఉండవచ్చు. కానీ, ప్రపంచం ముందు మాత్రం దోషిగా నిలబడే పరిస్థితులు తలెత్తవచ్చు. ఏదైనా తయారు చేయగలం, ఎంత చవకగా అయినా సరఫరా చేయగలమనే చైనా వ్యూహాలు ఇక ముందు పెద్దగా పని చేయకపోవచ్చు. ఎంచుకంటే, కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఆ దేశం పై అన్ని దేశాల్లో అనుమానాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి చాలా కంపెనీలు (విదేశీ కంపెనీలు) బయటకు వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికాకు చెందిన చాలా కంపెనీలు చైనా వీడి ఇతర ఆసియా దేశాలకు తమ తయారీ యూనిట్లను షిఫ్ట్ చేసే పనిలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే అనేకసార్లు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
కానీ, అయన మాటలను అమెరికా కంపెనీలు అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కరోనా వైరస్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైరస్ వ్యాప్తి గురించి చైనా బయటి ప్రపంచానికి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రపంచమంతా తల్లడిల్లిపోతుంటే.. లక్షలాది మందికి వైరస్ సోకి వేల మంది మరణిస్తుంటే.. చైనా మాత్రం మొత్తం కేసులను, మరణాలను తొక్కిపెట్టిందన్న ఆరోపణలున్నాయి.

ఇప్పుడు కాకుంటే... ఇంకెప్పుడు...
ఇండియా లో తయారీ రంగం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైసెస్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా ముడి సరుకులు ఇండియా లో తయారు చేయటానికి అవకాశాలు అపారం. కానీ సరైన వ్యూహాలు, ప్రభుత్వ మద్దతు లేకపోవటంతో మన వద్ద ఆశించిన ప్రగతి సాధ్యం కాలేదు. ఈ రంగాల్లో చైనా విపరీతమైన ప్రగతిని సాధించింది. మొత్తం ప్రపంచానికే ఎగుమతిదారుగా అవతరించింది. మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 12% నికి పైగానే అంటే దాని ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనా అధిపత్యానికి ఇకనైనా చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
చైనా లో ప్రోడక్టులు చవకే. కానీ వాటి నాణ్యత కూడా దిగదుడుపే. అందుకే, ఇటీవల కరోనా టెస్టుల కోసం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్న కిట్లను వాడొద్దని ఐసిఎంఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే, భారత్ సరైన వ్యూహాలతో ముందుకు వచ్చి చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలను ఇండియా కు రప్పించాల్సిన సమయం ఆసన్నమైంది.

సై అంటున్న తెలుగు రాష్ట్రాలు...
ఈ విషయాన్ని గమనించిన తెలుగు రాష్ట్రాలు చైనా నుంచి కంపెనీలను ఆకర్షించేందుకు వేగంగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అయితే ఒకడుగు ముందుకు వేసి అటు కేంద్రంతోనూ, ఇటు సంబంధిత కంపెనీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైసెస్, ఫార్మా ముడి సరుకులు వంటి అన్ని రకాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ అత్యంత అనుకూలంగా ఉంటుందని, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భూములు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ కంపెనీల ప్రతినిధులకు వివరిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ సింగల్ విండో విధానం అమల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుండటం తెలిసిందే. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం లో మెడికల్ డివైసెస్ పార్కు అందుబాటులో ఉంది కాబట్టి అక్కడికి సంబంధిత కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది రాష్త్ర ప్రభుత్వం. తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని, రాయలసీమలో ఆటోమొబైల్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తగ్గిన ఎగుమతులు...
ప్రపంచంలో భారీగా ఎగుమతులు చేసే అతి పెద్ద దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ, మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు కూడా కావటం గమనార్హం. అందునా... మనం చేసే ఎగుమతులకంటే దిగుమతులు అధికంగా ఉండటం మనకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. ముడి చమురు తర్వాత ఇండియా ఎక్కువగా దిగుమతి చేసుకునేది ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులనే.
అందుకనే, మన దేశంలో ఈ రంగాన్ని ప్రోత్సహిస్తే ఇటు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. అదే సమయంలో మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతులు పెంచుకోవచ్చు. అప్పుడు ఇండియా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరేందుకు పెద్దగా సమయం పట్టదు. సగటున మన దేశం 330 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేస్తుంది. ఇక్కడి నుంచి 190 దేశాలకు సుమారు 7,500 రకాల ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతాయి. కానీ, మన దిగుమతుల విలువ సుమారు 450 బిలియన్ డాలర్లు గా ఉంటుంది. సుమారు 6,000 రకాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాం. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా ఎగుమతులు కాస్త తగ్గి 314 బిలియన్ డాలర్ల కు పడిపోయాయి.
More From GoodReturns

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications