భారతదేశ వ్యవసాయరంగం శతాబ్దాలుగా అనేక రకాలుగా కష్టనష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్‌లో మధ్యవర్తుల ఆధిపత్యం..ఇలా ఒకటేమిటి ఎన్నో అంశాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. అయితే గత కొన్ని ఏళ్లుగా రైతులకు ఒక కొత్త వెలుగురేఖ కనిపిస్తోంది. దాని పేరే అగ్రి టెక్ స్టార్టప్స్. అంటే ఇప్పుడు రైతులు కూడా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. వారు కూడా టెక్ సాయంతో వ్యవసాయాన్ని ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు.
డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసులు : డ్రోన్‌ల ద్వారా పంటలపై స్ప్రేయింగ్ చేయడం, నేల నాణ్యతను పరీక్షించే సెన్సార్లు, మొబైల్ యాప్స్ ద్వారా మార్కెట్ ధరల సమాచారం ఇవ్వడం, రైతులకు రుణం అందించే డిజిటల్ ప్లాట్‌ఫార్ములు ఇలా ఎన్నో రకాలైన టెక్ సాధనాలు వారికి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒకప్పుడు టెక్నాలజీ అనగానే మనకు గుర్తొచ్చేది నగరాలు, ఐటీ హబ్‌లు మాత్రమే. అయితే ఇప్పుడు దిశ మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఎయిరోఫామ్ అనే చిన్న స్టార్టప్ డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసులు ఇస్తోంది. గంటల తరబడి కూలీలు కష్టపడే పనిని, కేవలం 15 నిమిషాల్లో డ్రోన్ పూర్తి చేస్తోంది. రైతులు సమయం, శ్రమ, నీరు అన్నీ ఆదా చేసుకుంటున్నారు.

నీటి వృథాను అరికట్టే విదానం : ఇక తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో అగ్రీజెల్ అనే యాప్ రైతులకు ప్రెసిషన్ ఫార్మింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. నేలలో తేమ స్థాయి ఎంతుందో సెన్సార్ల ద్వారా తెలుసుకుని, అవసరమైనంతే farmlands కు నీటిని సరఫరా చేస్తోంది. దీని వలన నీటి వృథా తగ్గడమే కాకుడా దిగుబడి 15 నుంచి 20 శాతం పెరిగింది. ఇలాంటి స్టార్టప్స్ ఎక్కువగా టియర్-2, టియర్-3 టౌన్లలోనే స్థాపించబడుతున్నాయి. IITల నుండి వచ్చిన యువ ఇంజనీర్లు, స్థానిక వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులు తమ ఉద్యోగాలను వదిలేసి ఇలా వ్యవసాయంలో సరికొత్త అడుగులు వేస్తున్నారు.

నేరుగా కొనుగోలు దారులతో లింక్ : మరో ఉదాహరణ ఏంటంటే.. విజయవాడలోని ఫార్మ్‌ఈజీ యాప్ ద్వారా రైతులు తమ పంటలను నేరుగా కొనుగోలుదారులతో లింక్ చేసుకుంటున్నారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా, రైతులు మెరుగైన ధర పొందుతున్నారు. కేవలం 2 సంవత్సరాల్లోనే 50 వేల మంది రైతులు ఈ యాప్‌లో చేరారు. టెక్నాలజీ వేగంగా రైతుల చెంతకు చేరుతుందనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్లు రెడీ : ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా కొత్తగా దూసుకువచ్చిన రంగంపై దృష్టి పెట్టారు. అమెరికాలోని కొన్ని వెంచర్ క్యాపిటల్ సంస్థలు, హైదరాబాద్‌లోని రెండు అగ్రి-టెక్ స్టార్టప్స్‌లో పెట్టుబడులు పెట్టాయి. దీనికి ప్రదాన కారణం ఏంటంటే.. భారత్‌లో దాదాపు 60 శాతం మంది జనాభా ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. ఈ మార్కెట్ స్థాయి విపరీతంగా ఉంది. దీంతో ఇన్వెస్టర్లు కూడా దీనివైపు మొగ్గు చూపుతున్నారు.
సమస్యలు ఇంకా ఉన్నాయి: అయితే ఈ మార్పు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు, రైతుల్లో డిజిటల్ మీద అవగాహన తక్కువగా ఉండటం, అలాగే ప్రాథమిక పెట్టుబడి వంటి సవాళ్లు ఉన్నాయి. ఒక చిన్న రైతు సెన్సార్లు లేదా డ్రోన్ సర్వీసులు కొనుగోలు చేయడానికి డబ్బు పెట్టడం చాలా కష్టతరమవుతుంది. అందుకే ఈ స్టార్టప్స్ ఎక్కువగా సర్వీస్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నాయి - అంటే రైతు ఒక యంత్రాన్ని కొనకుండా, తక్కువ ఫీజుతో సేవ పొందగలడు.

Representational image of Modern Farming (This image is created with AI)
2030 నాటికి భారతదేశ అగ్రి-టెక్ మార్కెట్ విలువ: వ్యవసాయ నిపుణుల అంచనా ప్రకారం.. 2030 నాటికి భారతదేశ అగ్రి-టెక్ మార్కెట్ విలువ 25 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ, AI ఆధారిత పంట అంచనా వ్యవస్థలు, సప్లై చైన్ డిజిటలైజేషన్ వంట అంశాలు భారతదేశ అగ్రి-టెక్ విప్లవానికి ప్రధాన మద్దతు ఇస్తున్నాయి.భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలో నడిపిస్తున్నాయి.
రైతు మాటల్లో..
నెల్లూరు జిల్లా కావలికి చెందిన రైతు రవికుమార్ మాట్లాడుతూ.. మా లాంటి చిన్న రైతులకు ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. నీరు ఎక్కడ వేయాలో, ఎరువు ఎంత వేయాలో యాప్ చెబితే పొలం సగం పని తగ్గుతుందన్నారు. ఇప్పుడే కొన్ని స్టార్టప్స్ వస్తున్నాయి. వాళ్లు యాప్‌లో భాష కూడా తెలుగు లో పెడుతున్నారు. పెద్ద రైతులు కాకుండా చిన్న రైతులకు కూడా చేరితే నిజంగా మంచి మేలు జరుగుతుందన్నారు.
అయితే మాకు ఇంటర్నెట్ బాగా రాదు. ఫోన్‌లో యాప్ ఎలా వాడాలో కూడా తెలియని రైతులు చాలా మంది ఉన్నారు. ఈ డిజిటల్ లిటరసీ లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు. డ్రోన్ స్ప్రేయింగ్ వేసుకుంటే ఒక ఎకరానికి 2 గంటల పని 10 నిమిషాల్లో అయిపోతుంది. మందు వృథా తగ్గుతుంది. ఖర్చు కూడా 30-40 శాతం తగ్గుతుందన్నారు.
కొత్త టెక్నాలజీతో పంట నాణ్యత మెరుగుపడుతుంది. దాంతో మార్కెట్‌లో మంచి ధర వస్తుంది. కానీ, ధరలు పూర్తిగా టెక్నాలజీ వల్లే పెరగవు, డిమాండ్ కూడా ఉండాలన్నారు. డ్రోన్లు, సెన్సార్లు, యాప్‌లు ఎక్కువగా వస్తే రైతు పని మరింత సులభమవుతుంది. అంచనా వేసి ముందే ఏం చేయాలో చెప్పగలిగితే పంట నష్టాలు తగ్గుతాయని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications