గత బీఆర్ఎస్ ప్రభుత్వం (కేసీఆర్ ప్రభుత్వం) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ఇంకా చెప్పాలంటే ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ ప్రాజెక్టు గుదిబండలా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ తీసుకున్న రుణాల చెల్లింపులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు తలకు మించిన భారంలా మారాయి. గ్యారంటీగా ఉన్న ప్రభుత్వమే కార్పొరేషన్ రుణాలను చెల్లించాల్సి రావడంతో రాష్ట్ర ఖజాకు ఇది తడిసి మోపెడవుతోంది.
తాజాగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్), తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్) పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించిన రూ. 1,393.65 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని రేవంత్ రెడ్డి సర్కారును.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) కోరింది. IE కథనం ప్రకారం.. గడువులోగా బకాయిలను చెల్లించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఈ నెల 6న ఆర్‌ఈసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జతీన్‌కుమార్ నాయక్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు లేఖ రాశారు.

2025 మే 31 నాటికి రెండు కార్పొరేషన్లకు సంబంధించి రూ.1,393.65 కోట్లు (కాళేశ్వరం కార్పొరేషన్ రూ.890.31 కోట్లు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూ.503.33 కోట్లు) వాయిదా చెల్లించాల్సి ఉందని, 68 రోజులుగా చెల్లించడం లేదని లేఖలో తెలిపింది. ఈ నెల 28, 29వ తేదీల్లోగా ఈ రుణ వాయిదాలను చెల్లించని పక్షంలో రెండు కార్పొరేషన్ల లోన్ అకౌంట్లను నిర్థరక ఆస్తులుగా (NPA) పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే గడువు దాటిపోయింది. రుణాల చెల్లింపు మాత్రం జగరడం లేదు.
ఇప్పటికే ఈ రుణ ఖాతాలు RBI గైడ్‌లైన్స్ ప్రకారం SMA-2 (Special Mention Account-2) గా పరిగణించబడ్డాయి. అలాగే కంపెనీస్ యాక్ట్, 2013 ప్రకారం Stage-2 గా వర్గీకరించబడ్డాయి. అంటే ఈ రుణాలు చాలా తీవ్రమైన స్థాయిలో పాతబడినవని అర్థం చేసుకోవాలి. ఈ జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ సంస్థలపై, క్రెడిట్ రేటింగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని REC లేఖలో హెచ్చరించింది.
REC ఇప్పటికే KIPCL కు రూ.30,536.08 కోట్లు రుణంగా మంజూరు చేసింది. అయితే గతేడాది అక్టోబరులో, ఈ రుణాలపై వడ్డీ రేటు 9%లోపు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తర్వాత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. REC, Power Finance Corporation (PFC) సంస్థల నుంచి తీసుకున్న రుణాలను పునఃనిర్మాణం చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఈ రుణాలను రాష్ట్ర కాంసొలిడేటెడ్ ఫండ్ ద్వారా చెల్లిస్తున్నారు. అయినప్పటికీ, ఈ నెలాఖరులోగా బకాయిలు చెల్లించలేదు.దీంతో ఈ ఖాతాలు ఎన్‌పీఏలుగా మారుతాయా లేదా అనేది చూడాలి. దీనివల్ల రాష్ట్ర పైనే కాకుండా, ఇతర ఆర్థిక ప్రణాళికలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య కేఐపీసీఎల్‌తోపాటు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు వ్యవధిని పెంచడంతోపాటు వడ్డీలను తగ్గించడం ద్వారా వాటిని పునర్వ్యవస్థీకరించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆర్‌ఈసీ తిరస్కరించింది.
2030 నాటికి 9 శాతం, 2035 నాటికి 18 శాతం, 2036 నాటికి 27 శాతం, 2040 నాటికి 46 శాతం రుణాలను తిరిగి చెల్లించేలా గడువులను పొడిగించాలని రేవంత్ రెడ్డి సర్కారు కోరింది. అయితే అది కుదరదని గతేడాది నవంబర్ 5న ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆర్‌ఈసీ తేల్చిచెప్పింది. కాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల ఆర్‌ఈసీ రుణాల్లో 71 శాతాన్ని 2029-30 నాటికి.. మిగిలిన 29 శాతాన్ని 2035 నాటికి చెల్లించాల్సి ఉంది.ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications