Hyderabad: హైదరాబాద్‌పై గోల్డ్‌మాన్ సాచ్స్ ఫోకస్.. విస్తరణతో కొత్తగా వేల ఉద్యోగాలు..

KTR News: ప్రపంచ కంపెనీలకు ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ డ్రీమ్ బిజినెస్ డెస్టినేషన్ గా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో కంపెనీలు విస్తరణకు మహానగరాన్ని ఎంచుకుంటున్నాయి. దీని వెనుక మంత్రి కేటీఆర్ చొరవ, కృషి అధికంగా ఉంది.

అమెరికన్ బహుళజాతి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాక్స్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే త్వరలో కొత్తగా ఎనిమిది అంతస్తుల కార్యాలయాన్ని ప్రారంభించనుంది. కంపెనీ ప్రయత్నాలు హైదరాబాద్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్(BFSI) రంగానికి ఊతమిచ్చే అవకాశం ఉంది.

Telangana IT Minister KTR met Goldman sachs officials at new york, hyderabad BFSI

ప్రస్తుతం హైదరాబాద్ ఆఫీసులో కంపెనీ 1,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ తన కొత్త ఎనిమిది అంతస్తుల కార్యాలయాన్ని 2,000 మంది నిపుణులతో ప్రారంభించనుంది. అంటే రానున్న కాలంలో ఈ సంఖ్యను 3,000లకు పెంచాలని నిర్ణయించింది. ఇది ఇక్కడి యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. ఈ కార్యాలయం ఇన్నోవేషన్ హబ్‌గా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం న్యూయార్క్‌లో గోల్డ్‌మన్ శాక్స్ బృందంతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ను బిఎఫ్‌ఎస్‌ఐ సంస్థలకు ఇష్టమైన గమ్యస్థానంగా మార్చడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి సానుకూల ఫలితాలను ఇస్తోందని సమావేశం తర్వాత కేటీఆర్ వెల్లడించారు. గోల్డ్‌మన్ సాచ్స్ విస్తరణ BFSI హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ఆకర్షనీయ ఆర్థిక కేంద్రంగా నగరం మారటానికి దోహదపడుతుందని అన్నారు.

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మాస్ మ్యూచువల్, హెచ్‌ఎస్‌బీసీ, స్టేట్ స్ట్రీట్, బెర్కాడియా, వెల్స్ ఫార్గో, జెపి మోర్గాన్ చేజ్, ఇన్వెస్కో వంటి అగ్రశ్రేణి సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాడు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+