EPFO: రిటైర్డ్ ఉద్యోగిని రూ.2.50 కోట్లు తిరిగి ఇవ్వాలన్న పీఎఫ్.. సాధ్యం కాదన్న కోర్టు..
ఉద్యోగం చేసే దాదాపు అందరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఈ పీఎఫ్ ఖాతాలోకి నెలకు కొంత మొత్తం వెళ్తుంటుంది. ఈ సొమ్ముకు ప్రభుత్వం కొంత వడ్డీ చెల్లిస్తోంది. ఈ డబ్బంతా రిటైర్డ్ అయిన తర్వాత తీసుకోవచ్చు. అలాగే ఉద్యోగులకు పెన్షన్ కూడా వస్తుంది. అయితే అత్యవసరాలు ఉంటే పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా లేకపోతే, పిల్లల పెళ్లిల్లు ఉంటే లేదా ఇల్లు కొనుగోలు చేసినప్పుడు కొంత మొత్తం డ్రా చేసుకోవచ్చు. కానీ ఓ ఉద్యోగి మాత్రం మొత్తం సొమ్మును రిటైర్డ్ అయ్యాక తీసుకున్నారు.
అయితే తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అతనికి నోటీసులు ఇచ్చింది. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి హైకోర్టుకు వెళ్లాడు. ఈపీఎఫ్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిగింది. రిటైర్డ్ అయిన ఉద్యోగికి చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలన్న పీఎఫ్ నోటీసులను హైకోర్టు కొట్టిపడేసింది. కంపెనీ తప్పు చేస్తే ఆ సొమ్మును ఉద్యోగి నుంచి రికవరీ చేయడం సరైంది కాదని పేర్కొంది. 2023లో జేవీ నృపేందర్ రావు అనే ఉద్యోగి రిటైర్డ్ అయ్యారు.

ఆ తర్వాత ఆయన తనకు రావాల్సిన పీఎఫ్ మొత్తానికి దరఖాస్తు చేసుకున్నారు. నృపేందర్ రావు రావాల్సిన డబ్బును పీఎఫ్ ట్రస్ట్ ఆ నిధులను యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. అందులో రూ.2 కోట్ల 50 లక్షలు కంపెనీ నుంచి ఆయన ఖాతాకు వెళ్లాయి. రూ.70 లక్షలు కంపెనీ వద్దే ఉన్నాయి. అయితే ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఆ డబ్బు ఫ్రీజ్ అయింది. యస్ బ్యాంక్ కు అంతకుముందు వరకు మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్ట్ హోదాలో ఉండేది. కానీ మార్చి 1, 2023 ఆ హోదా సస్పెండ్ అయింది.
రూల్స్ ప్రకారం ట్రస్ట్ హోదాను వదులుకున్నాక కంపెనీ తన వద్ద ఉన్న మొత్తం పీఎఫ్ నిధులను ఈపీఎఫ్‌ఓ ఖాతాకు బదిలీ చేయాలి. అంతేగానీ నేరుగా ఉద్యోగుల ఖాతాలో జమ చేయకూడదు. సదరు కంపెనీ ట్రస్ట్ హోదా వదులుకున్నాక జూలై 2023లో నృపేందర్ రావుకు రూ.2కోట్ల 50లక్షలు చెల్లించింది. ఇది చట్ట ప్రకారం నేరమని.. గత సంవత్సరం నృపేందర్ రావుకు పీఎఫ్ రికవరీ నోటీసులు ఇచ్చింది. 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ నృపేందర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కేసు వాదనలు విన్న జస్టిస్ నాగేష్ భీమపాక నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ తీర్పు వెలువరించింది.


Click it and Unblock the Notifications