Rythu Bharosa: యాసంగి రైతు భరోసా అప్పుడే.. కానీ అలా జరిగితే లేనట్లే..!
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి ఎకరాకు రూ.12 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఎకరాకు సీజన్ రూ.6 వేలు చొప్పున సంవత్సరానికి రూ.12 వేలు చెల్లిస్తున్నారు. రైతు భరోసా వాన కాలం సీజన్ కు సంబంధించి అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇప్పుడు యాసంగి రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. యాసంగి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అన్నదాతలు ఆశగా చూస్తున్నారు. అయితే యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు.
డిసెంబర్, జనవరి మాసాల్లో యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా రెండో విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 24వ విడత రూ.2 వేలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. దీంతో తెలంగాణ రైతులు యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే ఈసారి కూడా యాసంగి రైతు భరోసా వచ్చే అవకాశం లేదని కొంత మంది చెబుతున్నారు. గత సంవత్సరం యాసంగి సీజన్ కు సంబంధించి కొంత మందికే రైతు భరోసా విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఈసారైన పూర్తిగా రైతు భరోసా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. దీంతో యాసంగి సీజన్ లో పంటల సాగు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే తప్పా.. రైతు భరోసా వస్తుందా రాదా అనేది తెలియదు.
రైతు భరోసా అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 9 వేల కోట్ల వరకు అవసరం పడుతుంది. ఈ డబ్బును అప్ప చేయాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే రైతు భరోసాకు లిమిట్ విధించాలన డిమాండ్ ఉంది. ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా నిబంధనలు మార్చాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications