అవును. ఇది నిజం. ఒకప్పుడు అందరం ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లేమిటిరా బాబూ ఎప్పుడూ లాప్టాప్ ముందు పెట్టుకొని, ఇంట్లోనే ఏదో చేస్తుంటారు. ఏమైనా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు అని తెగ ఆశ్చర్యపోయేవాళ్ళం. కొన్ని సార్లు వాళ్ళని తిట్టుకొని కూడా ఉంటాం. ఒక్క ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పని మాత్రమే కాదు, వాళ్లు పూర్తి జీవన శైలి ఇప్పడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు మంచి మార్గం అని నిపుణులు పేర్కొంటున్నారు.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..
దీంతో మళ్ళీ ఆశ్చర్య పోవటం మన వంతు అవుతోంది. ఎందుకంటే ... టెకీలు (సాఫ్ట్ వేర్, అనుబంధ రంగాల్లో పనిచేసే వారిని ఇలా పిలుస్తారు) ప్రతిదీ ఆన్లైన్ లో బుక్ చేస్తారు. ఇంటికి గ్రోసరీస్ కావాలన్నా... మూవీ టిక్కెట్లు కావాలన్నా... చివరకు ఫుడ్ కూడా ఆన్లైన్ లోనే బుక్ చేసి వారు కూర్చున్న చోటకే అన్నీ వచ్చేలా చేసుకుంటారు. బయటకు వచ్చి ఎవర్నీ కలవకుండానే... ఒక్క అడుగు కూడా ఇంటి నుంచి బయటకు రాకుండానే అన్ని పనులూ చక్కబెట్టేస్తారు. సరిగ్గా అదే అలవాటు వారిని ఇప్పుడు కరోనా నుంచి బయటపడేస్తోంది. అంతే కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ను అన్ని రంగాలకు వర్తింపజేసేందుకు కారణం అవుతోంది.

చైనా నుంచి ఇండియా వరకు...
చైనా లో మొదలైన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతోంది. గుంపులు గుంపులుగా జనాలు ఉండే చోటకు వెళితే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకే అవకాశాలు అధికం కాబట్టి... కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని చైనాలో హుకుం జారీ చేశారు. కొన్ని నగరాలను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. దాంతో నిజానికి చైనా లో సుమారు 3,000 మంది మరణించినా... మరింత ఎక్కువ మరణాలు నమోదు కాకుండా అడ్డుకోగలిగారు. ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ లో ఒక్క కేసు పాజిటివ్ అని తేలగానే ... మొత్తం హైటెక్ సిటీ అప్రమత్తమైంది. సాఫ్ట్ వేర్ నిపుణులను ఇంటి నుంచే పనిచేయమని చాలా కంపెనీలు సూచించాయి. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానానికి తాత్కాలిక బ్రేకులు వేశాయి. ఒకే ఆఫీస్ లో వేలమంది నిపుణులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాధి లక్షణాలు ఒక్కరికి ఉన్నా ప్రమాదమేనని భావిస్తున్న కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కు జై కొడుతున్నాయి.

ఉందిగా ఆన్‌లైన్
అమెరికా, చైనా, ఇండియా ... దేశం ఏదైనా అక్కడ ఈ-కామర్స్ కంపెనీల హవా నడుస్తోంది. చాకోలెట్ నుంచి టాయిలెట్ పేపర్ వరకు, ఫుడ్ నుంచి బెడ్ వరకు ఏది కావాలన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. చివరకు చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనులను కూడా ఆన్లైన్ చేశారు. దీంతో మనం కాలు కడపకుండానే అన్ని పనులు లాప్టాప్, మొబైల్ ఫోన్ తో చేసేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గి, జొమాటో ల నుంచి ఏదైనా కొనుగోలు చేయవచ్చు. సినిమాలు చూడాలంటే కూడా థియేటర్ కు వెళ్లాల్సిన పనిలేదు. నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో నచ్చిన కొత్త సినిమాను చూసేయ్యోచు. చివరకు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్ లో నెంబర్ తీసుకొని, ఫోన్లే మాట్లాడి సమస్యను వివరించవచ్చు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసి మెడిసిన్స్ కూడా ఇంటికే తెప్పించుకోవచ్చు. సో, కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఇంతకంటే మెరుగైన మార్గాలు ఏముంటాయి చెప్పండి అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

తిట్టినవారే మెచ్చుకుంటున్నారు..
కాలు కదపకుండా, శారీరక శ్రమ లేకుండా అన్నీ కూర్చున్న చోటకే తెప్పించుకునే టెకీ సంస్కృతి ని తిట్టినవారే అధికం. దాంతో జీవన శైలి వ్యాధులు పెచ్చరిల్లుతున్నాయని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. హృద్రోగం, ఊబకాయం, బీపీ, షుగర్, న్యూరో సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని హెచ్చరికలు జారీ చేశారు. అది నిజం కూడా. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తున్న తరుణంలో మాత్రం టెకీల జీవన శైలి వారికే కాకుండా ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. కొన్ని రోజుల పాటు ఇంటి నుంచే అన్ని పనులూ చక్కబెట్టుకుంటే మనల్ని మనం కరోనా బారిన పడకుండా చూసుకోగలం. అలాగే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడగలం. ఈ సమయంలో అటు పొల్యూషన్ కూడా భారీగా తగ్గించినట్లు అవుతుంది. సో, ఎలా చూసుకున్నా ఈ విధానం ఇప్పుడు దివ్యఔషధంలా కనిపిస్తోంది. సాహో టెకీ.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications